చిన్నల్లుడికి చిరు ఏం చెప్పాడో తెలుసా!
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన డెబ్యూ మూవీ విజేత నిరాశపరిచింది. మంచి అంచనాలతో ఈ చిత్రం విడుదలైనప్పటికీ ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. కళ్యాణ్ నటనకు మంచి మార్కులే పడ్డా ఇంకా పరిణితి సాధించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
దీనితో చిరంజీవి తన అల్లుడికి కొన్ని సూచనలు చేశారట. రెండవ చిత్రం విషయంలో తొందర పడకుండా నిర్ణయం తెసుకోవాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ లోపు నటన, డాన్సులపై దృష్టి సారించి పురోగతి సాధించాలని సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. కొంతకాలం సినిమాకు బ్రేక్ ఇచ్చి ఈ రెండు అంశలపై సాధన చేయాలని కళ్యాణ్ తో చెప్పినట్లు తెలుస్తోంది.

అదే సమయంలో కళ్యాణ్ దేవ్ రెండవ చిత్రం కోసం చిరంజీవి అనుభవం ఉన్న దర్శకుడిని ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. విజేత విషయంలో పకడ్బందీగా వ్యవహరించినా ఆ చిత్రం ప్రేక్షకులని మెప్పించలేకపోయింది.


Click it and Unblock the Notifications











