Bholaa Shankar మెగాస్టార్ చిరంజీవి శివతాండవం.. మహాశివరాత్రి కానుకగా మోషన్ పోస్టర్ రిలీజ్
దర్శకుడు మెహెర్ రమేష్ డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న రామబ్రహ్మ సుంకర నిర్మిస్తున్న మెగా యాక్షన్ ఎంటర్‌టైనర్ భోళా శంకర్. ఈ సినిమా షూటింగు శరవేగంగా హైదరాబాద్‌లో జరుగుతున్నది. ప్రధాన నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే రిలీజ్‌కు సిద్దమవుతున్న నేపథ్యంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన శివతాండవం చేస్తున్న శంకరుడు మోషన్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
భోళా శంకరుడు మోషన్ పోస్టర్ విషయానికి వస్తే.. చిరంజీవి ఉగ్ర అవతారంలో కనిపంచారు. చేతిలో డమరుకం పట్టుకొని నటరాజులా తాండవం చేస్తూ కనిపించారు. చిరంజీవి భంగిమ చూస్తే.. శివుడు తాండవం చేస్తున్నట్టు కనిపించారు. మోషన్ పోస్టర్‌కు మహతి స్వర సాగర్ అందించిన బీజీఎం స్పెషల్ ఎఫెక్ట్‌గా నిలిచింది. మహాశివరాత్రి పండుగకు సరిపడే విధంగా మోషన్ పోస్టర్ లుక్‌ను రిలీజ్ చేసి అభిమానులకు పండుగ సంబరాలను అందించారు.

భోళా శంకరుడు సినిమాలో తమన్నా భాటియా హీరోయిన్‌గా నటిస్తుండగా, కీర్తీ సురేష్ సోదరి పాత్రలో నటిస్తున్నారు. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌తోపాటు ఏకే ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై అనిల్ సుంకర్ నిర్మిస్తున్నారు. మార్తాండ్ వెంకటేష్ ఎడిటింగ్, ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. సత్యానంద్ కథను, తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు.
నటీనటులు: చిరంజీవి, తమన్నా, కీర్తీ సురేష్, రఘుబాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను తదితరులు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మెహర్ రమేష్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
బ్యానర్: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్
మ్యూజిక్: మహతి స్వర సాగర్
ఎడిటర్: మర్తాండ్ కే వెంకటేష్
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాశ్
కథ: సత్యానంద్


Click it and Unblock the Notifications











