twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పొలిటికల్ రూమర్లపై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి... నెక్ట్స్ ప్లాన్ ఏమిటంటే?

    |

    మెగాస్టార్ చిరంజీవి త్వరలో తన 151వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'సైరా నరసింహారెడ్డి' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ 2 ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ పీరియడ్ డ్రామాను రామ్ చరణ్ తన సొంత బేనర్ 'కొణిదెల ప్రొడక్షన్స్'లో నిర్మిస్తున్నారు. మెగాస్టార్ కెరీర్లో మాత్రమే కాదు... బాహుబలి, సాహో తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న మూవీ ఇది.

    ప్రమోషన్లలో మెగాస్టార్ బిజీ బిజీ

    ప్రమోషన్లలో మెగాస్టార్ బిజీ బిజీ

    ‘సైరా' విడుదలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉండటంతో చిరంజీవి ప్రమోషన్లలో బిజీ అయ్యారు. ఇటీవల ఆయన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైరా సినిమాకు సంబంధించిన అంశాలతో పాటు రాజకీయ, సామాజిక అంశాలపై కూడా స్పందించారు.

    పవన్ కళ్యాణ్, జనసేన ఓటమిపై...

    పవన్ కళ్యాణ్, జనసేన ఓటమిపై...

    చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. ఈ అంశంపై ఎదురైన ప్రశ్నకు చిరంజీవి రియాక్ట్ అవుతూ... పొలిటికల్ జర్నీ అనేది సుధీర్ఘమైనది, ఈ ప్రయాణంలో గెలుపు ఓటములు అనేవి సహజమే అన్నారు.

    పవన్ కళ్యాణ్‌లో ఆ సత్తా ఉంది

    పవన్ కళ్యాణ్‌లో ఆ సత్తా ఉంది

    పవన్ కళ్యాణ్ ఒక లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చాడు. ఇపుడు ఆయను ఓటమి ఎదురైనప్పటికీ భవిష్యత్తులో పార్టీని విజయ పథంలోకి నడిపించే సామర్థ్యం ఉన్న వ్యక్తి, అతడి ఆశయాలు చాలా బలమైనవి, క్రమ క్రమంగా ప్రజల మద్దతు లభిస్తుంది అని చిరంజీవి నమ్మకం వ్యక్తం చేశారు.

    బీజేపీలో చేరుతారనే వార్తలపై..

    బీజేపీలో చేరుతారనే వార్తలపై..

    చిరంజీవి భారతీయ జనతార పార్టీలో చేరబోతున్నారంటూ ఇటీవల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ వార్తలపై కూడా మెగాస్టార్ స్పందించారు. ఆ వార్తలను ఖండించకుండా తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. నేను పార్టీలో చేరాలని వారు కోరుకుంటున్నారేమో... కానీ నేను నా పూర్తి ఫోకస్ సినిమాలపైనే పెట్టాను అని వ్యాఖ్యానించడం ద్వారా తనకు రాజకీయాలు చేసే ఉద్దేశ్యం లేదని చెప్పకనే చెప్పారు మెగా స్టార్.

    English summary
    "My focus is on movies and not interested in politics." Chiranjeevi's reaction on BJP political offer. Chiranjeevi, is an Indian film actor and politician. He was the Minister of State with independent charge for the Ministry of Tourism, Government of India from 27 October 2012 to 15 May 2014.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X