Mega Star Chiranjeevi: 70 ఏళ్ల వయసులో చిరంజీవి మేజిక్... మెస్మరైజింగ్ లుక్‌లో మెగాస్టార్!

70 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లకి గట్టి పోటీ ఇస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ ఏడాది సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు మూవీతో తిరుగులేని విజయాన్ని అందుకున్నారు చిరు. ఏకంగా 400 కోట్ల రూపాయల వసూళ్లతో సత్తా చాటారు. టాలీవుడ్‌ నలుగురు అగ్ర కథానాయకుల్లో ఎవరికీ లేని ఫీట్‌ను సాధించారు మెగాస్టార్. తిరిగి వచ్చే సంక్రాంతికి మరో సినిమాను వదిలేందుకు చిరంజీవి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చిరు నటిస్తున్నారు. ఈ సినిమా కోసం చిరంజీవి సరికొత్తగా మేకోవర్ అవుతున్నారు. 70 ఏళ్ల వయసులోనూ చెక్కు చెదరని గ్లామర్‌తో ఆకట్టుకుంటున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

చిరంజీవిని చూస్తుంటే ఆయన వయసు రివర్స్ అవుతుందా అని అనిపించకమానదు. 70 ఏళ్ల వయసులోనూ చెక్కు చెదరని వయసు, ఫేస్‌లో మెరుపును అలాగే మెయింటైన్ చేస్తున్నారు. ఆయన దృష్టిలో ఫిట్‌నెస్ అంటే ఫిజికల్ ఫిట్‌నెస్ ఒక్కటే కాదు.. మానసికంగానూ దృఢంగా ఉండాలి. ఇందుకోసం కెరీర్ ప్రారంభం నుంచి నేటి వరకు తనకంటూ కొన్ని కఠిన నిబంధనలను చిరంజీవి పాటిస్తున్నారు. ఎంత కష్టమోచ్చినా సరే వీటిని పక్కాగా అమలు చేస్తూ తన అందాన్ని, ఫిట్‌నెస్‌ను చిరు కాపాడుకుంటున్నారు.

Chiranjeevi s Stunning Makeover at 70 Leaves Fans Amazed Megastar Photos Goes Viral

చిరు ఎప్పుడూ స్ట్రెస్ ఫ్రీగా ఉంటారు. ఎప్పుడూ మానసికంగా కూల్‌గా ఉంటూ, ప్రశాంతంగా ముఖంపై చిరునవ్వుతో కనిపిస్తారు. ఇక ఆహారం విషయంలోనూ చిరు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తన వయసు, ఫిట్‌నెస్ దృష్ట్యా వెజిటేరియన్ హై జెనిక్ ఫుడ్‌నే మెగాస్టార్ ఇష్టపడతారు. ఎక్కువగా ప్రోటీన్ పుడ్స్, సలాడ్, సూప్స్ తాగుతారు. ఎంత కష్టమైనా షూటింగ్‌కి ఇంటి నుంచే భోజనం తెప్పించుకుంటారు. రెగ్యులర్‌గా వర్కవుట్స్, యోగా, ప్రాణయామం వంటివి అస్సలు మిస్ అవ్వరు. పాత్రకు తగినట్లుగా తనను తాను మలచుకోవడానికి జిమ్‌లో కష్టపడతారు. ఉదయం 4 గంటలకే లేచి 6 గంటల వరకు వర్కవుట్స్ చేసి ఆ తర్వాతే తన షూటింగ్స్, ఇతర రోజువారీ కార్యక్రమాలలో బిజీ అవుతారు. బరువును అదుపులో ఉంచుకోవడానికి తగిన నియంత్రణ పాటిస్తానని చిరంజీవి పలుమార్లు వెల్లడించారు.

తాజాగా చిరంజీవి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఆయన నాజూకుగా, యవ్వనంగా, అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. లేత తెలుపు రంగు పోలో షర్ట్‌లో అట్రాక్ట్ చేస్తున్నారు. బాక్సీ ఫీట్, ఓపెన్ కలర్ చిరు బాడీకి క్రేజీ లుక్ తీసుకొచ్చాయి. ఈ ఔట్‌ఫిట్‌లో చిరంజీవి తన వయసులో సగం ఉన్నట్లుగా కనిపిస్తూ.. యువ హీరోలకు గట్టిపోటీని ఇస్తున్నారు. బాబీ సినిమా కోసమే చిరంజీవి ఇలా మేకోవర్ అయ్యుండొచ్చని ఫిలింనగర్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా.. ఫ్యాన్స్ చిరు అందంపై కామెంట్స్ పెడుతున్నారు.

ఇక బాబీ- చిరంజీవి సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతానికి మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. జన నాయగన్, టాక్సిక్ వంటి భారీ చిత్రాలను నిర్మిస్తోన్న కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వాస్తవానికి మార్చి నెలలోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లాల్సి ఉండగా.. జన నాయగన్ మూవీ విడుదల విషయంలో ఏర్పడిన జాప్యం, తదితర కారణాలతో చిరంజీవి - బాబీ మూవీపై ఎఫెక్ట్ పడింది. ఈ సినిమాకు కాకా అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తారని వార్తలు వస్తున్నాయి.

Read more about: chiranjeevi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X