ఆ దర్శకుడితో కలిసి పనిచేయను.. తేల్చి చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించడం, ఆయనను డైరెక్ట్ చేయడమంటే అదొక తీరని కల. ఎందరో ఔత్సాహిక దర్శకులు, సీనియర్ డైరెక్టర్స్ చిరంజీవితో కలిసి పనిచేయాలని ఉవ్విల్లూరుతుంటారు. అలాగే గొప్ప, సృజనాత్మక దర్శకులతో కలిసి పనిచేయాలని చిరంజీవి కూడా ఎదురు చూస్తుంటారు. అయితే ఇటీవల ఓ దర్శకుడితో కలిసి పనిచేయాలనే కోరిక నాకు లేదనే విషయం చెప్పి అభిమానులను, సినీ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేశారు. అయితే ఆచార్య రిలీజ్‌కు ముందు చిరంజీవి ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో చెప్పిన విషయాలు ప్రస్తుతం సినీ వర్గాల్ో చర్చనీయాంశమయ్యాయి. ఇంతకు చిరంజీవి కలిసి పనిచేయకూడదని నిర్ణయించుకొన్న దర్శకుడు ఎవరు? అందుకు కారణం ఏమిటంటే?

గ్రాండ్‌గా సెకండ్ ఇన్నింగ్స్

గ్రాండ్‌గా సెకండ్ ఇన్నింగ్స్

నా జీవితంలో ఎంతో మంది నటీనటులు, దర్శకులతో పనిచేశాను. నా కెరీర్ గ్రాఫ్ ప్రతీ దశలోనే అద్భుతంగా ఉంది. నా కెరీర్‌లో ప్రతీ క్షణాన్ని ఎంజాయ్ చేశాను. నా కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 15 చిత్రంతో మళ్లీ గ్రాండ్‌గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాను. ఆ తర్వాత సైరా కూడా బాక్సాఫీస్ విన్నర్‌గా నిలిచింది అని చిరంజీవి అన్నారు.

90 ఏళ్ల వరకు నటిస్తా

90 ఏళ్ల వరకు నటిస్తా

తెలుగు ప్రేక్ష‌కులు ప్రతీ క్షణం నన్ను ఆదరించారు. ప్రేమను కురిపించారు. తెలుగు వ్యక్తిగా నాకు గర్వంగా ఉంటుంది. నేను ఎప్పుడు డబ్బు కోసం పనిచేయలేదు. కేవలం నాలోని తపనను సంతృప్తి పరుచుకొనేందుకు నటించాను. నాకు ఇష్టమైన నటుడు క్లింట్ ఈస్ట్‌ఉడ్. ఆయన మాదిరిగానే 90 ఏళ్ల వరకు నటిస్తాను అని చిరంజీవి అన్నారు.

పవన్ కల్యాణ్‌తో కలిసి నటించేందుకు

పవన్ కల్యాణ్‌తో కలిసి నటించేందుకు


నేను పవన్ కల్యాణ్ కలిసి నటించాలని కోరుకొంటున్నాను. కానీ మా ఇద్దరికి సరిపోయే కథ లభించడం లేదు. అయితే మంచి స్క్రిప్ట్, సరైన అవకాశం లభిస్తే నా తమ్ముడితో నటించాలని ఎదురు చూస్తున్నాను అని చిరంజీవి తెలిపారు.

రాజమౌళి డైరెక్షన్‌లో

రాజమౌళి డైరెక్షన్‌లో


ఆచార్య తర్వాత రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నారనే వార్తల్లో నిజం లేదు. నాకు రాజమౌళితో పనిచేయాలనే కోరిక లేదు. నేను ఆయనతో కలిసి పనిచేయను. నాకు అవకాశం వర్చినా నేను నటించను. ఎందుకంటే. నేను నటుడిగా రాజమౌళిని ఎలా సంతృప్తి పరుచాలో తెలియదు. ఆయనను మెప్పించడం నాకు కష్టమే అనిపిస్తుంది అని చిరంజీవి అన్నారు.

ఆచార్య మూవీ నిరాశలో

ఆచార్య మూవీ నిరాశలో


ఇక ఆచార్య సినిమా విషయానికి వస్తే.. మెగా ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ సినిమా దారుణమైన పరాజయాన్ని చవిచూస్తున్నది. బాక్సాఫీస్ వద్ద పేలవమైన కలెక్షన్లను రాబడుతున్నది. ఆచార్య విషయంలో మెగా అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X