టాలీవుడ్ తీరుపై మెగాస్టార్ అసంతృప్తి? ఆ డైరెక్టర్‌ను ఉద్దేశించే చిరంజీవి వ్యాఖ్యలు చేశారా?

టాలీవుడ్‌లో ప్రతీ డైరెక్టర్, చాలా మంది డైరెక్టర్లు స్క్రిప్టు ముందు ఫ్రీజ్ చేయడం గానీ, ఆ సినిమాలో నటించే ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులకు స్క్రిప్టు గురించి తెలియచేయడం లేదు. దాంతో సినిమాపై వారి పాత్రలపై అవగాహన ఉండటం లేదు. ఒకవేళ స్క్రిప్టుపై అవగాహన ఉంటే సినిమాకు వచ్చే రిజల్ట్ వేరు.నటీనటులు, సాంకేతిక నిపుణుల ఇన్వాల్‌వేరుగా ఉంటుంది. దాంతో సినిమాపై ఆ ఫలితం తప్పకుండా మరోలా ఉంటుంది అని చిరంజీవి మాట్లాడుతూ..

హీరోకు తప్ప మిగితా వారికి కథేంటో

హీరోకు తప్ప మిగితా వారికి కథేంటో


సాధారణంగా మెయిన్ హీరోకు కథ, సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లు తెలిసి ఉంటాయి. అప్పుడే వచ్చే కమెడియన్లు, ఆర్టిస్టులకు స్క్రిప్టు గురించి, వారి పాత్రల గురించి తెలియదు. ఆర్టిస్టులు, టెక్నికల్ టీమ్‌తో రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసి.. స్క్రిప్టు చదవడం, డైలాగ్స్ గురించి తెలుసుకోవడం చేయాలి. దాంతో సెట్స్‌పైకి వెళ్లేటప్పుడు ఆర్టిస్టు తన డైలాగులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదు. అప్పటికే వారి మైండ్‌లో డైలాగ్స్ ఉండటం వల్ల ఫెర్ఫార్మెన్స్ మీద దృష్టిపెట్టడానికి వీలు ఉంటుంది. దాంతో తన పాత్ర పరిధిని బట్టి ఎలా బెస్ట్ ఇవ్వాలో తెలుసుకొంటాడు అని చిరంజీవి అన్నారు.

సెట్‌లోకి వెళ్లిన తర్వాత డైలాగ్స్ ఇస్తే..

సెట్‌లోకి వెళ్లిన తర్వాత డైలాగ్స్ ఇస్తే..

కొన్నిసార్లు సెట్‌లోకి వెళ్లిన తర్వాత డైలాగ్ స్క్రిప్టు ఏది అంటే.. డైరెక్టర్ రాస్తున్నారు సార్ అని అంటారు. దాంతో ఏం డైలాగ్స్ రాస్తారో అనే కంగారు మొదలవుతుంది. ముందు టిఫిన్ పెట్టినా తినడానికి మనసు ఒప్పుకోదు. సెట్‌లో డైలాగ్ పేపర్ ఇవ్వడం వల్ల ఆ డైలాగ్ చెబితే నా పని అయిపోతుందనే ఫీల్ కలుగుతుంది. కాబట్టి అమీర్ ఖాన్ పాటించినట్టుగా మన ఇండస్ట్రీ కూడా వర్క్‌షాప్స్ నిర్వహించాలి. మూడు నెలల ముందుగానే స్క్రిప్టు ఇచ్చేలా ప్రయత్నం చేయాలి అని చిరంజీవి సూచించారు.

అమీర్ ఖాన్ మాదిరిగా వర్క్‌షాప్

అమీర్ ఖాన్ మాదిరిగా వర్క్‌షాప్

అమీర్ ఖాన్ సినిమా ప్రారంభానికి ముందు తన నటీనటులు, సాంకేతిక నిపుణులతో వర్క్‌షాప్ నిర్వహిస్తారు. ఆ సినిమాలోని డైలాగ్స్, సీన్లు ఇవి ఉంటాయని డిస్కస్ చేస్తారు. దాంతో ప్రతీ ఆర్టిస్టుకు సినిమా గురించి తెలుస్తుంది. అయితే మన ఇండస్ట్రీలో అలాంటి పద్ధతి లేదు. వర్క్‌షాప్స్ నిర్వహించడం వల్ల ఉండే అడ్వాంటేజ్ మరో విధంగా ఉంటుంది అని చిరంజీవి అన్నారు.

రాజమౌళి లాంటి వాళ్లు

రాజమౌళి లాంటి వాళ్లు

తెలుగులో ఎక్కువగా వర్క్‌షాప్స్ నిర్వహించే వారిలో రాజమౌళి ఉంటారు. ఆయన తన టీమ్ మొత్తంతో రాత్రింబవళ్లు వర్క్‌షాప్స్ నిర్వహిస్తుంటారు. నటీనటులను తమ పాత్రల కోసం తయారు చేస్తుంటారు. సాంకేతిక నిపుణులకు అవగాహన కల్పిస్తుంటారు. సినిమా మొదలుపెడితే.. ఆయనకు అదే లోకం మాదిరిగా ఉంటారు అని చిరంజీవి చెప్పారు. రాజమౌళిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మీడియాలో వైరల్ అయ్యాయి.

స్క్రిప్టు గురించి అమీర్ ఖాన్

స్క్రిప్టు గురించి అమీర్ ఖాన్

ఇక అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. నేను మూడు నెలల ముందుగానే సినిమా స్క్రిప్టు ఇవ్వాలని అడుగుతాను. స్క్రిప్టు నా చేతికి వచ్చిన తర్వాత నేను నా పాత్రకు సంబంధించిన డైలాగ్స్ బట్టి పడుతాను. నేను నిద్రలో ఉన్నాసరే ఎవరైనా తట్టి లేపితే నా నోటి నుంచి డైలాగ్స్ వస్తాయి. సెట్‌లోకి వెళ్లిన తర్వాత బెటర్‌గా ఎలా చేయవచ్చనేది ఆలోచిస్తాను. అందుకే వర్క్‌షాప్స్ ఉండాలని కోరుకొంటాను అని చిరంజీవి చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X