మెగాస్టార్ షాకింగ్ డిసీజన్.. వెంటనే మార్పులు చేయండి అంటూ ఆర్డర్!

మెగాస్టార్ చిరంజీవిలో ప్రధాన ఆకర్షణ ఆయన డాన్సులే. చిరు స్టెప్పులేశాడంటే థియేటర్లన్నీ హోరెత్తి పోవాల్సిందే. దశాబ్దాల కాలంగా ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. కేవలం వెండితెరపై మెగాస్టార్ స్టెప్పులు చూడాలని వెళ్లేవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఆ సినిమా లోనూ డాన్సులతో దుమ్ముదులిపేశారు. అయితే తాజా సమాచారం మేరకు ఆయన కొత్త సినిమా 'సైరా నరసింహా రెడ్డి' లో ఒక్క స్టెప్పు కూడా ఉండదని తెలుస్తోంది.

Chiranjeevi Shocking Decision On Sy Raa Narasimhaa Reddy

తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అక్టోబర్ నెలలో ఈ సినిమాను విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు యూనిట్ సభ్యులు. అయితే హిస్టారికల్ సినిమా కాబట్టి 'సైరా'లో డాన్సులకు పెద్దగా స్కోప్ ఇవ్వకూడదని చిరు భావిస్తున్నారట. ఈ మేరకు డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ఈ విషయమై డిస్కస్ చేసిన చిరు.. తనకు సంబందించిన డాన్సుల తాలూకు సీన్స్ తొల‌గించ‌మ‌ని చెప్పారట. దీంతో ప్రస్తుతం అదే పనిలో నిమగ్నమై ఉందట చిత్రయూనిట్. ప్రస్తుతం ఫిలింనగర్ సర్కిల్స్ లో ఈ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. తన నటనలో ఎంతో ప్రధాన ఆకర్షణ అయిన డాన్సులనే పక్కన పెట్టేశారంటే 'సైరా'లో ఏ రేంజ్‌లో సన్నివేశాలు ఉంటాయో అర్థం చేసుకుపోవచ్చు.

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో 'సైరా నరసింహా రెడ్డి' మూవీ తెరకెక్కుతోంది. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయన తార హీరోయిన్‌గా నటిస్తోంది. మిల్క్ బ్యూటీ తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కుచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు లాంటి భారీ తారాగణం పాలు పంచుకుంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X