కేటీఆర్ బెంచ్‌మెట్.. వినయ విధేయుడు కాదు.. లైఫ్‌లో రెండే సాధించాను.. అవేమిటంటే.. చిరంజీవి

రంగస్థలం సెన్సేషనల్ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన చిత్రం వినయ విధేయ రామ. ఈ చిత్రానికి క్రేజీ డైరెక్టర్ బోయపాటి శ్రీను. దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 28న రిలీజ్ కానున్నది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నటులు చలపతి రావు, సీనియర్ హీరోయిన్ స్నేహ, క్యారెక్టర్‌ ఆర్టిస్టులు హేమ, ప్రవీణ, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ..

జీవితంలో రెండు సాధించా

జీవితంలో రెండు సాధించా

వినయ విధేయ రామ సినిమాను ఆశీర్వదించడానికి వచ్చిన మెగా అభిమానులకు అభినందనలు. మీ కేరింతలు మాకు అత్యంత ఉత్సాహాన్ని అందిస్తాయి. జీవితంలో ఏమైనా సాధించావని ఎవరైనా అడిగితే నేను రెండే మాటలు చెబుతాను. ఒకటి రాంచరణ్, రెండోది కోట్లాది అభిమానులు.

అభిమానులపై మీమాంస ఉండేది

అభిమానులపై మీమాంస ఉండేది

కొంతకాలం రాజకీయాల్లోకి వెళ్లి వచ్చిన తర్వాత నాపై అభిమానం ఎలా ఉంటుందో అని కొంత మీమాంస ఉండేది. కానీ ఖైదీ నంబర్ 150తో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మీ అభిమానం చెక్కు చెదరలేదని అనిపించింది. ఆ సినిమాను సూపర్ డూపర్ హిట్ చేసినందుకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఎప్పుడూ మీ అభిమానం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను.

కేటీఆర్ నాకు బెంచ్‌మెట్

కేటీఆర్ నాకు బెంచ్‌మెట్

వినయ విధేయ రామ సినిమా ఫంక్షన్ తన బిజీ షెడ్యూల్ వదులుకొని వచ్చిన కేటీఆర్‌కు ముందుగా థ్యాంక్స్. ఆయన నాకు బెంచ్‌మెంట్. అంటే మేమిద్దరం ఒకేసారి అసెంబ్లీలోకి ప్రవేశించాం. అసెంబ్లీలో నేను ఆయనను అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. ఆయన వినయ విధేయ రామ అని అనిపించేది. కానీ నిజానికి కేటీఆర్ నేను అనుకొన్నంత వినయ విధేయ రామ అసలే కాడు అని చిరంజీవి అన్నారు.

కేటీఆర్ డేరింగ్, డైనమిక్, డాషింగ్

కేటీఆర్ డేరింగ్, డైనమిక్, డాషింగ్

మాటల తూటలతోని ప్రత్యర్థులను నోర్లు మూయించే డైనమిక్ లీడర్ కేటీఆర్. అలాగే అంతర్జాతీయ వేదికల మీద అద్భుతంగా ఆంగ్లంలో మాట్లాడటం తెలుగు వాళ్ల ప్రతిష్టను మరింత ముందుకు తీసుకెళ్లాడు. నా కెరీర్ బిగినింగ్‌లో నన్ను డేరింగ్, డాషింగ్, డైనమిక్ అనేవారు. ఆ మూడు మాటలు కేటీఆర్ అనే మూడు అక్షరాలకు చక్కగా సరిపోతాయి.

 రంగస్థలం తర్వాత రాంచరణ్

రంగస్థలం తర్వాత రాంచరణ్

రంగస్థలం సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో రాంచరణ్‌కు నాకు ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. గోవిందుడు అందరివాడే సినిమా తర్వాత ధ్రువ లాంటి మోడ్రన్ స్టోరి చేశాడు. ఆ తర్వాత ఏం చేద్దామనుకొంటున్న సమయంలో బోయపాటి చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. ఆ కథ నేను చేసిన గ్యాంగ్ లీడర్ సినిమా గుర్తొచ్చింది. కుటుంబాన్ని రక్షించే ఓ యువకుడి పాత్ర నాకు బాగా నచ్చింది. బోయపాటి ఏదైతే చెప్పాడో అదే సినిమాగా తెరకెక్కించాడు.

రాంచరణ్ చెప్పిన డైలాగ్స్ శెభాష్

రాంచరణ్ చెప్పిన డైలాగ్స్ శెభాష్

వినయ విధేయ రామ సినిమా ట్రైలర్‌లో రాంచరణ్ మాస్‌గా కనిపించాడు. రాంచరణ్ చెప్పిన రామ్ కొణిదెల డైలాగ్.. అలాగే వాడిని చంపాలా? భయపెట్టాలా.. భయపెట్టాలంటే పది నిమిషాలు.. చంపాలంటే పదిహేను నిమిషాలు అని చెప్పిన డైలాగ్స్ విని శెభాష్ అని అరిచాను. రాంచరణ్ చేత బోయపాటి చక్కగా చేయించాడు.. రాంచరణ్ తెర మీద చక్కగా పండించాడు అని చిరంజీవి అన్నారు.

 దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి

దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి

దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సాంగ్స్ బాగుంది. తస్సాదియ్యా.. ఏక్ బార్ పాటలు బాగున్నాయి. బోయపాటి, దేవీ కాంబినేషన్ చక్కగా కుదిరింది. కథను తెరకెక్కించే విషయంలో బోయపాటి శ్రీను ఎక్కడా రాజీ పడలేదు. కథ కోసం లొకేషన్లు నచ్చకపోతే అజర్ బైజాన్‌లో షూట్ చేశారు. బోయపాటి రిక్వెస్ట్‌కు స్పందించి డీవీవీ దానయ్య ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను తెరకెక్కించాడు.

 అందం అభినయంతో కియారా

అందం అభినయంతో కియారా

కియారా అద్వాని తన అందం, అభినయంతో మెప్పించారు. మిగితా నటీనటులు బాగా నటించారు. డీవీవీ దానయ్యను విజయలక్ష్మీ, ధనలక్ష్మీ వరిస్తారు. వినయ విధేయ రామ విజయం తథ్యం అనే విషయాన్ని నేను చెబుతున్నాను అని చిరంజీవి తెలిపారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X