మాట తప్పావు.. నా కమిషన్ ఏది? సుమకు చిరంజీవి స్వీట్ వార్నింగ్!
Chiranjeevi- Anchor Suma: యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఏ ఈవెంట్ లో యాంకరింగ్ చేసినా.. తన మాటల గారడితో అందర్నీ చిత్తు చేస్తుంది. ఆ ఈవెంట్ కు హజరైన స్టార్ హీరోలను, యాక్టర్లను ఆటపట్టిస్తూ హంగామా చేస్తుంటుంది. యాంకర్ సుమ ఉందంటే వేదిక సందడిగా మారిపోవాల్సిందే. అలాంటి యాంకర్ సుమను ఓ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి ఆటపట్టించారు. మెగాస్టార్ తనదైన శైలిలో సుమకు వార్నింగ్ ఇచ్చారు. ఆ మూమెంట్ ఈవెంట్‌లో అందర్నీ ఆకర్షించింది. ఈ వారిద్దరి చిట్ చాట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి యాంకర్ సుమకు ఎందుకు వార్నింగ్ ఇచ్చాడనే వివరాల్లోకి వెళితే..
హస్య బ్రహ్మ బ్రహ్మానందం, రాజా గౌతమ్, వెన్నెల కిశోర్ లు కీలక పాత్రల్లో నటించిన సినిమా 'బ్రహ్మ ఆనందం'. ఈ సినిమాకు ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించగా.. ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ నక్కా నిర్మించాడు. బ్రహ్మానందం.. తన కుమారుడు హీరోగా నిలబెట్టాలనే ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే 'బ్రహ్మ ఆనందం' అనే సినిమాతో వస్తున్నారు. ఈ సినిమా 14న విడుదల కానున్నది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఇలా భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ రావడం వంటివన్నీ సినిమాపై పాజిటివ్ వైబ్స్ తెచ్చాయి.

'బ్రహ్మ ఆనందం' ప్రీ రిలీజ్ ఈవెంట్ మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ' బ్రహ్మ ఆనందం' సినిమా విజయం సాధించాలని, మూవీ యూనిట్ కు యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ వేడుకలలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఇంతలోనే సడన్ గా 'సుమ ఇటు రా'అంటూ యాంకర్ సుమను స్టేజ్ పైకి పిలిచారు. దీంతో సుమ..'ఇక్కడే ఉన్నాను'అంటూ కంగారు కంగారుగా మెగాస్టార్ దగ్గరికి వచ్చింది. సుమ రాగానే 'పేమెంట్ పంపలేదు ఏంటి? ' అని మెగాస్టార్ అడిగాడు. దీంతో సుమ ఆశ్చర్యపోయింది. ఏం మాట్లాడాలో అర్థం కాగా.. ' అంటే ఈరోజు.. 'అని సుమ ఏదో చెప్పేలోపే.. 'మొన్న లైలా ఈవెంట్ కు సంబంధించిన పేమెంట్ కూడా పంపలేదుగా' అంటూ చిరంజీవి పంచ్ వేశాడు.
'ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ అండీ.. సుమ వెళ్లి చోట నా గురించి చెబుతుంది.. నేను వెళ్లే చోట సుమ గురించి చెబుతాను. ఒకరికి ఒకరు కోపరేట్ చేసుకుంటూ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం.. వచ్చిన మొత్తంలో ఇద్దరం షేర్ చేసుకుంటాం. ఇలా రెండు ఈవెంట్స్ నుండి పేమెంట్స్ పంపించడం లేదు. ఇలా చేస్తున్నా కాబట్టి ఇకపై నా గురించి నువ్వు ఎక్కడ మాట్లాడకు.. నీ గురించి నేను కూడా ఎక్కడా మాట్లాడాను' అంటూ చిరంజీవి అనగానే.. అనిల్ రావిపూడి.. పేమెంట్ ఇవ్వడం లేదు సుమ తప్పించుకునే ప్రయత్నం చేసింది. దీంతో టాపిక్ కు డైరెక్టర్ అనిల్ రావిపూడి వైపుకు తిరిగింది.

'అనిల్ కూడా అంతే.. మొన్న ఈవెంట్ కి వచ్చినప్పుడు పేమెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు మన ముగ్గురమే దొరికాం కదా ఫంక్షన్ కు పిలవడానికి.. ఇకపై మనం న్యాయంగా ఉందాం. మూట తప్పదు.. సారీ మాట తప్పదు' అంటూ సుమకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు చిరంజీవి. ప్రస్తుతం వీరి మధ్య జరిగిన ఈ ఫన్నీ కన్వర్జేషన్ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్స్ అదుర్స్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు మెగా అభిమానులు. చిరు దెబ్బకు సుమ నోటికి తాళం పడిందంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు..


Click it and Unblock the Notifications











