చరణ్ విషయంలో చిరంజీవి డేరింగ్ స్టెప్: అతడిని వదిలి పెట్టేందుకే ఈ నిర్ణయం

మెగాస్టార్ చిరంజీవి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆచార్య'. మెగా మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ సినిమాను టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్నాడు. దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాలో తండ్రీ కొడుకులు ఇద్దరూ నక్సలైట్లుగా నటిస్తున్నారు. ఇంకొంత భాగం షూటింగ్ బ్యాలెన్స్ ఉన్న సమయంలో కరోనా సెకెండ్ వేవ్ కారణంగా అది కాస్తా వాయిదా పడింది. దీంతో సినిమా విడుదలపై దాని ప్రభావం పడింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

'ఆచార్య' సినిమాకు 20 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉండిపోయిందట. ఇందులో ఓ పాటతో పాటు చరణ్‌కు సంబంధించిన కొన్ని సీన్స్, చిరంజీవి చేయాల్సిన సన్నివేశాలు కొన్ని బాకీ ఉండిపోయాయి. ఈ సినిమా షూటింగ్ జూలై నుంచి ప్రారంభం కాబోతుందట. తాజా సమాచారం ప్రకారం.. ఈ షెడ్యూల్‌లో ముందుగా చరణ్ పార్ట్‌ను కంప్లీట్ చేయాలని చిరంజీవి.. దర్శకుడు కొరటాల శివకు సూచించాడని తెలిసింది. దీనికి కారణం ఆ వెంటనే RRR షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుండడమేనట. అందుకు అనుగుణంగానే చిత్ర యూనిట్ షూటింగ్ ఏర్పాట్లు చేస్తుందని తెలిసింది.

Chiranjeevi Try to Complete Ram Charan Part in Acharya

భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న 'ఆచార్య' సినిమా షూటింగ్‌ను జూలైలో జరిగే షెడ్యూల్‌లోనే కంప్లీట్ చేయబోతున్నారట. ఇందుకోసం ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకోబోతున్నారని తెలుస్తోంది. హైదరాబాద్‌లో నిర్మించిన టెంపుల్ టౌన్‌ సెట్‌లోనే ఈ షూటింగ్ మొత్తం జరగనుందట. ఇదిలా ఉండగా.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూర్చుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X