For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిరంజీవిని అలా మిస్ అయ్యా.. ఇప్పుడు ఆ కోరిక తీరింది.. మలయాళ రీమేక్‌‌కు దర్శకుడు ఎవరంటే

|

ఒకభాషలో హిట్టు కొట్టిన సినిమాను మరో భాషలో సక్సెస్ అయ్యేలా చేయడం కష్టమేమీ కాదు. అయితే అలా రీమేక్ చేసేటప్పుడు అన్నివేళలా విజయం లభిస్తుందా అంటే చెప్పలేం. మన నేటీవిటీ మిస్ కాకుండా, స్టార్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని తగినన్ని మార్పులు చేస్తే కచ్చితంగా విజయం లభిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి మరో రీమేక్‌పై కన్నేసినట్లు సమాచారం.

కొరటాల మూవీని ప్రారంభించిన చిరు..

కొరటాల మూవీని ప్రారంభించిన చిరు..

సైరా ఇచ్చిన జోష్‌తో చిరంజీవి తన తదుపరి ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కిస్తున్నాడు. తాజాగా కొరటాల శివతో తన 152వ చిత్రాన్ని ప్రారంభించేశాడు. లాంఛనంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేసిన చిత్రయూనిట్.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టనుంది.

మలయాళ రీమేక్‌పై చిరు దృష్టి..

మలయాళ రీమేక్‌పై చిరు దృష్టి..

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్.. లూసిఫర్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నాడు. వంద కోట్లను కొల్లగొట్టి.. మాలీవుడ్ సత్తా చాటింది. హీరో, దర్శకుడు అయిన పృథ్వీ రాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే ఈ మూవీపై చిరు ఆశ పడ్డట్లు తెలుస్తోంది.

సైరా వేడుకలో పాల్గొన్న పృథ్వీరాజ్..

సైరా వేడుకలో పాల్గొన్న పృథ్వీరాజ్..

సైరా ఈవెంట్‌ను కేరళలో ఏర్పాటు చేసినప్పుడు పృథ్వీరాజ్ పాల్గొని.. సైరా గురించి మాట్లాడాడు. చిరు కూడా ప్రసంగిస్తూ.. డేట్స్ కుదరకపోవడంతో పృథ్వీరాజ్‌ను సైరాలో తీసుకోలేకపోయామని తెలిపాడు. అనంతరం ఆ హీరో సోషల్ మీడియా వేదికగా ప్రసంగిస్తూ.. లూసిఫర్ హక్కులు తీసుకున్నారని తెలిసి చాలా థ్రిల్ అయ్యానని తెలిపాడు.

సుకుమార్ చేతికి రీమేక్ బాధ్యతలు..

సుకుమార్ చేతికి రీమేక్ బాధ్యతలు..

ఇంత వరకు రీమేక్ చేయని సుకుమార్‌కు ఈ మూవీ బాధ్యతలు అప్పగించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. రంగస్థలం లాంటి హిట్ ఇచ్చి.. మెగా ఫ్యామిలీకి దగ్గరైన సుక్కుపై ఈ బాధ్యతలను పెట్టారు. ఈ మూవీలో మరో ముఖ్యమైన రోల్ ఉండటంతో.. అది రామ్ చరణ్ పోషిస్తాడని మరో టాక్ వినిపిస్తోంది. మరి ఇవన్నీ నిజమైతే మెగా ఫ్యాన్స్‌కు ఇక పండుగే. ఈ వార్తలపై చిరు గానీ, సుకుమార్ గానీ, రామ్ చరణ్ గానీ స్పందించే వరకు చూడాలి.

English summary
Buzz Is Thar Chiranjeevi Wants To remake Malayalam Film Lucifer, Which Is Starred bY Mohan Lal. Directed By Hero Pruthviraj. Sukumar May Takes Responsibility To Remake.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more