For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Chiranjeevi: రెండేళ్లపాటు ఒకే షర్ట్​ వేసుకున్న చిరంజీవి.. ఇంకా తెలియని విశేషాలు

  |

  ఎలాంటి బ్యాక్​గ్రౌండ్​ లేకుండా 'స్వయంకృషి'తో ఎదిగిన 'హీరో' మెగాస్టార్​ చిరంజీవి. నేటితరం యువ హీరోలు ఆయన్ను ఒక 'ఆచార్య'గా భావిస్తారు. ప్రతి పాత్రను 'ఛాలెంజ్'​గా తీసుకుని విభిన్నమైన ప్రయోగాలు, వైవిధ్యమైన డ్యాన్స్​లతో సక్సెస్​ అయిన 'విజేత'. టాలీవుడ్​ చిత్ర పరిశ్రమకు సరికొత్తగా లెక్కలు నేర్పిన 'మాస్టర్'​. సినీ ఇండస్ట్రీకి వచ్చిన ఏ సమస్యనైనా పరిష్కరించేందుకు ముందుండి నడిపించే 'గాడ్​ ఫాదర్'​. కరోనా కష్ట సమయంలో పేద కళాకారులను ఆదుకున్న 'ఆపద్భాందవుడు'. రక్త దానం, నేత్ర దానం పేరిట ఎంతోమంది ప్రాణాలను కాపాడిన 'అందరివాడు' చిరంజీవి పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా ఆయన గురించి పలు ఆసక్తికర విషయాలు ఏంటంటే..

  ఎప్పుడూ ప్రత్యేకమే..

  ఎప్పుడూ ప్రత్యేకమే..

  మెగాస్టార్​ చిరంజీవి బర్త్​డే ఆగస్టు 25 ఎంత స్పెషలో.. సెప్టెంబర్​ 22 కూడా అంతే ప్రత్యేకం. ఎందుకంటే చిరు నటించిన తొలి చిత్రం ప్రాణం ఖరీదు విడుదలైంది ఈ తేదినే. 1978లో సెప్టెంబర్​ 22న ప్రాణం ఖరీదు రిలీజైంది. కొణిదెల శివశంకర్ వర ప్రసాద్ అయిన నన్ను చిరంజీవిగా తెలుగు ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్​ చేసిన ఈ సినిమా నాకు ఎప్పుడు ప్రత్యేకమే అని చిరు చెబుతుంటారు.

  ఆ సాంగ్​ చాలా ఇష్టం..

  ఆ సాంగ్​ చాలా ఇష్టం..

  చిరంజీవికి రుద్రవీణ సినిమాలోని సాంగ్స్​ అంటే చాలా ఇష్టమట. చిరుకే కాదు ఆయన భార్య సురేఖకు కూడా ఆ సాంగ్స్​ అంటే ఇష్టమట. అందులో ముఖ్యంగా నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని పాటంటే చాలా ఇష్టమని గతంలో ఓసారి చెప్పారు.

  ఒక అలవాటుగా..

  ఒక అలవాటుగా..


  చిరంజీవికి ఫొటోగ్రఫీ అంటే ఎంతో ఇష్టమని సమాచారం. వీలు కుదినిప్పడుల్లా ప్రకృతి అందాలను తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్​ చేస్తుంటారు. నాకు చిన్నప్పటి నుంచి ఫొటోగ్రఫీ అంటే ఎంతో ఇష్టం. చిన్నప్పుడు నేను కెమెరాలు కొనుక్కోలేకపోయాను. ఇక సినిమాల్లోకి వచ్చాక నాకు తెలియకుండానే అదొక అలవాటు అయిపోయింది. అని ఓ ఇంటర్వ్యూలో చిరు తెలిపారు.

  చదవలేకపోయేవారట..

  చదవలేకపోయేవారట..

  టాలీవుడ్​కు బాస్​ అని ముద్దుగా పిలుచుకునే చిరంజీవి చేతి రాత అస్సలు బాగుండదట. చిరు రాసిన దాన్ని మళ్లీ ఆయనే చదవలేకపోయేవారట. సమయం దొరికినప్పుడల్లా హ్యాండ్ రైటింగ్​ను ప్రాక్టీస్​ చేస్తుంటానని చిరు పేర్కొన్నారు.

  తొలి దక్షిణాది హీరోగా..

  తొలి దక్షిణాది హీరోగా..

  సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డ్ ఆస్కార్​. ఈ అవార్డు రావడం ఎంతో గొప్ప విషయమని అందరికి తెలుసు. అలాగే ఈ వేడుకల్లో పాల్గొనడం కూడా అంతే గొప్ప విషయం. అయితే ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం అందుకున్న తొలి దక్షిణాది హీరో చిరంజీవి. 1987లో జరిగిన ఆస్కార్ అవార్డు ఫంక్షన్​లో చిరు పాల్గొన్నారు.

   రెండు బిరుదులున్న హీరో..

  రెండు బిరుదులున్న హీరో..

  చిరంజీవికి మెగాస్టార్​ అని బిరుదు రాకముందు సుప్రీమ్ అనే బిరుదు ఉండేది. సినీ కెరీర్​ తొలి నాళ్లలో ఆయనను సుప్రీమ్​ హీరోగా పిలిచేవారు. అనంతరం వచ్చిన మరణ మృదంగం సినిమా తర్వాత మెగాస్టార్​గా మారాడు చిరంజీవి. ఈ మూవీ ప్రొడ్యూసర్​ కేఎస్​ రామారావు చిరుకు ఆ బిరుదు ఇచ్చారట. దీంతో రెండు బిరుదులు పొందిన హీరోగా చిరు గుర్తింపు పొందారు.

  అందుకోసమే రెండేళ్లు ఒకే షర్ట్​..

  అందుకోసమే రెండేళ్లు ఒకే షర్ట్​..


  చిరు హీరోగా విజువల్ గ్రాఫిక్స్​తో తెరకెక్కిన మూవీ అంజి. ఈ మూవీ కోసం ఓ షర్ట్​ని రెండేళ్లపాటు ఉతకకుండా వేసుకున్నారట. ఈ చిత్రం క్లైమాక్స్​ను సుమారు రెండేళ్లపాటు తరెక్కెక్కించారట దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ. క్లైమాక్స్ కోసం షర్ట్​ను ఉతకకుండా ఉంచాల్సి వచ్చిందని అప్పట్లో కోడి రామకృష్ణ తెలిపారు.

  English summary
  Megastar Chiranjeevi Wear A Shirt For Two Years To Making Climax Scene In Anji Movie. Anji Movie Was Directed By Director Kodi Ramakrishna. In An Interview Kodi Ramakrishna Said That Shirt Was Not Washed Until Completing Anji Movie Climax Scene
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X