‘వేదాళం’ కోసం ఆ ప్రాంతానికి చిరంజీవి: సినిమాకు ప్లస్ అవబోతున్న హైలైట్ ఎపిసోడ్
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి జెట్ స్పీడుతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే 'ఖైదీ నెంబర్ 150', 'సైరా: నరసింహారెడ్డి' అనే చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమా చేస్తున్నారు. ఇది పట్టాలపై ఉండగానే మరో మూడు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టడంతో పాటు వాటికి సంబంధించిన ప్రకటనలు కూడా ఇచ్చేశారు. చిరంజీవి చేయబోతున్న చిత్రాల్లో 'వేదాళం' రీమేక్ ఒకటి. త్వరలోనే షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఒకటి ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది.
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా వచ్చి తమిళంలో ఘన విజయాన్ని అందుకున్న చిత్రం 'వేదాళం'. దీన్నే మెగాస్టార్ చిరంజీవి తెలుగులోకి రీమేక్ చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని మెహర్ రమేశ్ తెరకెక్కిచబోతున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో చాలా భాగం కేరళ నేపథ్యంతో సాగుతుందట. సెకెండాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ కానుందని అంటున్నారు. దీని కోసం చిరు త్వరలోనే ఆ రాష్ట్రంలో జరగనున్న షెడ్యూల్‌లో పాల్గొంటారని అంటున్నారు. అందుకోసం చిత్ర నిర్మాతలు తగిన ఏర్పాట్లను కూడా చేస్తున్నారని తెలుస్తోంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గుండుతో కనిపించబోతున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. దీనికి కారణం ఆ మధ్య లుక్ టెస్టు కోసం ఆయన జుట్టు లేకుండా మేకప్ వేసిన ఫొటోలు వైరల్ అవడమే. వాస్తవానికి తమిళంలోనూ అజిత్ అలాగే కనిపించాడు. ఇక, ఈ సినిమాలో బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్యా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుందని చిరంజీవే గతంలో వెల్లడించారు. అలాగే, ఇందులో సాయి పల్లవి కీలక పాత్రను పోషిస్తుందని ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











