సౌత్‌లో నా కుటుంబం.. ఆ లెజెండ్ ఫ్యామిలీని మించి.. చిరంజీవి ఎమోషనల్‌గా
తెలుగు సినిమా పరిశ్రమలో ఒక్కడిగా ప్రవేశించిన చిరంజీవి కొణిదెల కొద్ది సంవత్సరాల్లోనే అద్భుతమైన వటవృక్షంలా మారారు. కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాలేదు.. దేశవ్యాప్తంగా అని భాషల ప్రేక్షకులకు చేరువయ్యారు. ఎంతో మంది సహనటులను ప్రోత్సహించారు. తెలుగు సినిమా పరిశ్రమలోని నటులను సొంత కుటుంబంలా భావించాడు. అలాగే తమ కుటుంబం నుంచి డజను మంది సినిమా పరిశ్రమతో భాగమయ్యేలా చేశారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తమ పాపులారిటీని పెంచుకొంటూ వెళ్తున్నారు. అయితే తమ ఫ్యామిలీని దక్షిణాది కపూర్ ఫ్యామిలీ అని అనిపించుకోవాలన్నదే నా కోరిక అంటూ చిరంజీవి వెల్లడించారు.

హిందీలో కపూర్ కుటుంబం గురించి
ప్రస్తుతం ఆచార్య సినిమా ప్రమోషన్‌లో భాగంగా చిరంజీవి మీడియాతో రెగ్యులర్‌గా భేటీ అవుతున్నారు. అయితే తన కుటుంబం గురించి చిరు ఆశను వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. హిందీ సినిమా రంగంలో కపూర్ కుటుంబానికి గొప్ప క్రేజ్ ఉంది. హిందీ సినిమా అంటే.. కపూర్ ఫ్యామిలీ.. కపూర్ ఫ్యామిలీ అంటే హిందీ పరిశ్రమ అనే రేంజ్‌లో ఉంది అని చిరంజీవి అన్నారు.

దక్షిణాదిలో కపూర్ల కుటుంబం మాదిరిగా
హిందీ సినీ పరిశ్రమలో కపూర్ ఫ్యామిలీకి ఉండే గౌరవం మాదిరిగా మెగా ఫ్యామిలీ కూడా ఉండాలనేది నా కోరిక. మా కుటుంబం నుంచి పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రాంచరణ్ గొప్పగా రాణించడం చాలా హ్యాపీగా ఉంది. సినిమా రంగంలో వారికంటూ తమ స్థానాన్ని సుస్థిరం చేసుకొన్నారు అని చిరంజీవి అన్నారు.

ఉత్తరాదిలో అవమానాలు భరించి
ఒకప్పుడు ఢిల్లీకి వెళితే.. హిందీ సినిమా పరిశ్రమకే పెద్ద పీట ఉండేది. బాహుబలి తర్వాత తెలుగు సినిమాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కొన్నిసార్లు దక్షిణాది పరిశ్రమకు గుర్తింపుల లేకపోవడం నాకు బాధగా అనిపించడమే కాకుండా అవమానంగా అనిపించింది అని అన్నారు.

రాంచరణ్‌తో నటించడం గురించి
ఆచార్య చిత్రంలో రాంచరణ్‌తో కలిసి నటించడమనేది చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అవకాశాలు ఎప్పుడో ఒకసారి వస్తాయి. నటుడిగా రాంచరణ్ కెరీర్ గ్రాఫ్ దూసుకుపోయే స్థితిని చూడటం తండ్రిగా గొప్ప అనుభూతి. రాంచరణ్ తన కెరీర్‌ను మలుచుకొనే తీరు అద్బుతంగా ఉంది అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.

చిరంజీవి సెకండ్ ఇన్నింగ్ జోష్
చిరంజీవి తన కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకెళ్తున్నారు. ఆచార్య సినిమాను ఏప్రిల్ 29న రిలీజ్ చేయడానికి సిద్దంగా ఉన్నారు. అలాగే గాడ్ ఫాదర్, భోళాశంకర్, ఇంకా నాలుగైదు సినిమాలతో బిజీగా ఉన్నారు. యువ దర్శకులతో కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











