Chiranjeevi : తేజ్ కి మీ అందరి ఆశీస్సులు అవసరం.. ధైర్యాన్ని ఇస్తుందని ఆశిస్తున్నా!

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న రిపబ్లిక్ సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ ఒకటో తేదీన విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అయితే సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై కొద్ది రోజుల నుంచి హాస్పిటల్ లోనే ఉన్న నేపథ్యంలో ఆయన సినిమా ప్రమోషన్స్ బాధ్యతలను ఆయన మేనమామలు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీసుకుని సినిమాను జనంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక ఈ సినిమా గురించి సినీ ఇండస్ట్రీలో ఇతర హీరోలు సెలబ్రిటీలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండగా తాజాగా చిరంజీవి రిపబ్లిక్ యూనిట్ మొత్తానికి బెస్ట్ ఆఫ్ లక్ చెబుతూ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

అంతా సిద్ధం

అంతా సిద్ధం

ఈ మధ్యనే యాక్సిడెంట్ బారిన పడిన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం హాస్పిటల్‌లో ఉన్న సంగతి తెలిసిందే. బైక్ ప్రమాదంలో గాయపడిన హీరో.. ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అయితే మరో వైపు సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ చిత్రం విడుదలకు సిద్దమయింది. ముందుగా నిర్ణయించిన తేదీకి సినిమా విడుదల చేయాలని సాయి ధరమ్ తేజ్ కోరడంతో సినిమా యూనిట్ కూడా ఆడే డేట్ కు ఫిక్స్ అయింది. అందుకే అక్టోబర్ 1న అంటే రేపు సినిమాను రిలీజ్ చేసేందుకు అంతా సిద్ధం చేసింది.

ఆసక్తి రేపుతున్న ట్రైలర్

ఆసక్తి రేపుతున్న ట్రైలర్

కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు. అలా మేనల్లుడి కోసం మామలు సినిమాను ప్రమోట్ చేసేందుకు ముందుకు వచ్చారు. సాయి ధరమ్ తేజ్ అందుబాటులో లేనప్పిటికి ఆయన చిన్న మామ పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయి టాక్ ఆఫ్ టూ తెలుగు స్టేట్స్ గా మారారు. ఇక చిరు చేతుల మీదుగా విడుదలయిన సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

రిలీజ్ కి రెడీ

రిలీజ్ కి రెడీ

రాజకీయాలే ప్రధాన అంశంగా రూపొందుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతిబాబు, రమ్యకృష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కలెక్టర్ గా నటిస్తుండగా ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమా.. అక్టోబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది

అండగా చిరు

అండగా చిరు

ఈ నేపధ్యంలోనే సినిమా యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెబుతూ చిరంజీవి ట్వీట్ చేశారు. "సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. అతడికి మీ అందరి ఆశీస్సులు 'రిపబ్లిక్' చిత్ర విజయం రూపంలో అందుతాయని ఆశిస్తూ, ఆ చిత్రం యూనిట్ అందరికీ నా శుభాకాంక్షలు! అలాగే కరోనా సెకండ్ వేవ్ బారినపడి కుదేలైన సినిమా ఎక్సిబిషన్ సెక్టార్ కి 'రిపబ్లిక్' చిత్ర విజయం కూడా కోలుకోవడానికి కావాల్సినంత ధైర్యాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను." అంటూ ఆయన పేర్కొన్నారు.

Recommended Video

Sai Pallavi Heartfelt Speech About Nagarjuna In Love Story Success Meet
నాని అభినందనలు

నాని అభినందనలు

ఇక ఇప్పటికే ఇండస్ట్రీ సెలెబ్రిటీల కోసం స్పెషల్ స్క్రీనింగ్ లు వేస్తున్నారు. అలా చూసిన నేచురల్ స్టార్ నాని ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'సాయిధరమ్ తేజ్ తన చుట్టూ ఉన్నవారి పట్ల చూపించే ప్రేమాభిమానాలు, తిరిగి ఆయనకు అభిమానుల ప్రార్థనల రూపంలో చేరాయి. ఇప్పుడు మరింత బలంగా రిపబ్లిక్ సినిమా రూపంలో రాబోతున్నాయి. దర్శకుడు దేవాకట్టా తిరిగి ఫామ్ లోకి వచ్చాడని చెప్పడానికి ఈ సినిమా ఒక అనౌన్స్ మెంట్. చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు' అని ట్వీట్ చేశారు. మొత్తం మీద తేజ్ రిపబ్లిక్ కోసం అందరి ఆశీసులు అందుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X