Taapsee Pannu ని చూస్తే వావ్.. పాలిటిక్స్‌కు వెళ్లి ఆమెను మిస్ అయ్యా.. తాప్సీపై మనసుపడ్డ చిరంజీవి

అందాల తార తాప్సీ పన్ను నటించిన మిషన్ ఇంపాజిబుల్ సినిమా ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. కొన్ని ఫంక్షన్లకు అబ్లిగేషన్ మీద వస్తాం. కొన్నిఫంక్షన్లకు ప్రేమతో వస్తాం. ఈ ఈవెంట్‌కు నిర్మాత నిరంజన్ రెడ్డిపై ఉన్న ప్రేమతో వచ్చాను. అతి తక్కువ కాలంలో నాకు ఓ సోదరుడిగా నిరంజన్ రెడ్డి మారిపోయారు.

సుప్రీంకోర్టు లాయర్‌గా బిజీగా ఉండే నిరంజన్.. ఆచార్య సినిమాను ఎలా పూర్తి చేస్తాడనే అనుమానం కలిగింది. కానీ నిరంజన్ రెడ్డి సోదరుడు అవినాష్ రెడ్డి ప్రతిభతో ఆ లోటు కనిపించలేదు అని చిరంజీవి అన్నాడు. ఇంకా మిషన్ ఇంపాసిబుల్ సినిమా గురించి మాట్లాడుతూ..

 తాప్సీ, స్వరూప్ కాంబినేషన్‌లో

తాప్సీ, స్వరూప్ కాంబినేషన్‌లో

ఆచార్య సినిమా షూటింగులో బిజీగా ఉంటూనే మిషన్ ఇంపాజిబుల్ సినిమాను పూర్తి చేశారనే విషయం తెలుసుకొని నేను ఆశ్చర్యపోయాను. కొద్ది రోజుల క్రితం తాప్సీ, మరో ముగ్గురు కుర్రాళ్లు, ఆత్రేయ సాయి శ్రీనివాస్ సినిమా దర్శకుడు స్వరూప్ తో మిషన్ ఇంపాసిబుల్ చేశామని చెప్పినప్పుడు.. ఈ కాంబినేషన్ గురించి తెలిసి చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఈ సినిమా వేడుకకు ఆహ్వానించగానే వెంటనే వచ్చాను. ఆయన వైల్డ్ డాగ్ సినిమా తీసినప్పుడు నేను పిలవకుండానే మీటింగ్‌కు వచ్చాను. కొన్ని సినిమాలకు నా భుజం పెట్టి ఆసరాగా ఉండాలిపిస్తుంది అని చిరంజీవి అన్నారు.

చంటబ్బాయ్ లాంటి సినిమా అంటూ

చంటబ్బాయ్ లాంటి సినిమా అంటూ

దర్శకుడు స్వరూప్ చేసిన ఏజెంట్ ఆత్రేయ సాయి శ్రీనివాస్ సినిమా చేశాడు. ఆ సినిమా నేను నటించిన చంటబ్బాయ్ సినిమా మాదిరిగా ఉంటుందని విన్నాను. ఆ సినిమా చూడలేదు. కానీ త్వరలోనే చూస్తాను. ఇక మిషన్ విషయానికి వస్తే.. మ్యాటర్, మెటీరియల్, టాలెంట్ ఉన్న డైరెక్టర్ స్వరూప్. ఆయన ఇలాంటి సినిమా చేయడం ఫెంటాస్టిక్. ఇది చిన్న సినిమా కాదు. థియేటర్‌కు వెళ్లి చూస్తే పెద్ద సినిమాలా అనిపిస్తుంది అని చిరంజీవి అన్నారు.

తాప్సీ అందమైన బుట్టబొమ్మలా

తాప్సీ అందమైన బుట్టబొమ్మలా

ఇక మిషన్ ఇంపాసిబుల్ సినిమా వేడుకకు ముందే నేను మూవీని చూశాను. సినిమా చూస్తే కొన్నిసార్లు కథ మొత్తం చెప్పేస్తానోననే భయం ఉంటుంది. ఇందులో ఎంత చెప్పాలో.. ఎంత చెప్పకూడదో తెలియదు. ఈ సినిమా కథ మొత్తం చెప్పాస్తాను. తాప్సీ ఈ సినిమాలో ఉందంటే.. పవర్‌ఫుల్‌గా ఉంటుందని అనుకొన్నాను. ఝుమ్మంది నాదం సినిమా సమయంలో నేను ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తాప్సీని చూశాను. సున్నితమైన ఆటబొమ్మ మాదిరిగా ఉంది. కానీ హిందీలోకి వెళ్లి పింక్, ఘాజీ లాంటి అద్భుతమైన సినిమాలు చేసింది. ఈ సినిమాలో తాప్సీతోపాటు మరో ముగ్గురు కుర్రాళ్లు బాగా చేశారు అని చిరంజీవి అభినందించారు.

రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల తాప్సీ మిస్ అయ్యా

రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల తాప్సీ మిస్ అయ్యా

ఇక తాప్సీ తెలుగు సినిమాలకు దూరంగా ఉంది. హిందీలో బిజీగా ఉండటం వల్ల తెలుగులో చేయలేకపోయానని అని చెప్పింది. ఝుమ్మంది నాదం సినిమా చూసినప్పుడు తాప్సీని చూసి వావ్ అనుకొన్నాను. అప్పట్లో నేను రాజకీయాల్లోకి వెళ్లాను. దాంతో ఇలాంటి వాళ్లతో నటించే అవకాశం చేజిక్కించుకోలేకపోయాను. అప్పుడప్పుడు ఇలాంటి వాళ్లను మిస్ కావడంతో నేను ఎందుకు పాలిటిక్స్‌కు వెళ్లానా అనిపిస్తుంది అని చిరంజీవి అనడంతో ఫ్యాన్స్ ఈలలు వేసి గోల చేశారు.

తాప్సీ హీరోయిన్‌గా సినిమా చేయాలి

తాప్సీ హీరోయిన్‌గా సినిమా చేయాలి

అలాగే తాప్సీకి తన పక్కన నటించే అవకాశం ఇవ్వాలని నిర్మాత నిరంజన్ రెడ్డిని కోరుతూ.. ఆచార్య సినిమాలో కాజల్ అగర్వాల్‌కు అవకాశం ఇచ్చావు. మరో ముగ్గురికి స్పెషల్ క్యారెక్టర్లు ఇచ్చారు. తాప్సీకి నా పక్కన నటించే అవకాశం ఇవ్వకూడదు. తాప్సీని హీరోయిన్‌గా పెట్టి నాతో మీరే నిర్మాతగా సినిమా తీయాలి. యువ డైరెక్టర్లలో ఒకరిని లాటరీ ద్వారా ఎంపిక చేసి అవకాశం ఇద్దాం అని చిరంజీవి సరదాగా మాట్లాడటం ప్రేక్షకులకు హుషారు పుట్టించింది.

నన్ను డామినేట్ చేయవద్దు అంటూ చిరంజీవి

నన్ను డామినేట్ చేయవద్దు అంటూ చిరంజీవి

ఇక తాప్సీని ఆటపట్టిస్తూ.. హిందీ పింక్, ఇతర సినిమాలో అమితాబ్ బచ్చన్‌ను డామినేట్ చేస్తే యాంకర్ సుమ, నేను ఒప్పుకోను. మాకు గౌరవం ఇచ్చేలా ఉండాలి. తాప్సీకి అవకాశం ఇస్తే.. పాత్రతో ఎదుటి వాళ్లను తినేస్తుంది. మిషన్ ఇంపాసిబుల్ సినిమాలో కూడా తాప్సీ అద్బుతంగా నటించింది. ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది అని చిరంజీవి అన్నారు.

Recommended Video

RRR లో మల్లి..ఎవరీ చిట్టితల్లి? Twinkle Sharma లైఫ్ మలుపు తిప్పిన యాడ్ | Filmibeat Telugu
మిషన్ ఇంపాసిబుల్‌లో నటీనటులు, సాంకేతిక వర్గం

మిషన్ ఇంపాసిబుల్‌లో నటీనటులు, సాంకేతిక వర్గం

నటీనటులు: తాప్సీ పన్ను, రిషబ్ శెట్టి, హరీష్ పేరాడీ, సత్యం రాజేష్, రవీంద్ర విజయ్, హర్ష్ రోషన్, మణికంఠ వారణాసి, వివ్వనాథ్ మండాలిక, హర్షవర్ధన్, భాను ప్రకాశ్, జయతీర్థ తదితరులు
రచన, దర్శకత్వం: స్వరూప్ ఆర్‌ఎస్‌జే
నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
మ్యూజిక్: మార్క్ కే రాబిన్
సినిమాటోగ్రఫి: యారగెరా దీపక్
ఎడిటింగ్: రవితేజ గిరిజాల
రిలీజ్ డేట్: 2022-04-01

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X