‘లూసీఫర్’ విషయంలో చిరంజీవి వెనకడుగు: అలా డిసైడ్ అయిపోయిన డైరెక్టర్

రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కుర్ర హీరోలా మారిపోయారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి కారణం ఆయన లుక్కులు కాదు.. వేగంగా సినిమాలను చేస్తుండడమే. 'ఖైదీ నెంబర్ 150'తో కమ్‌బ్యాక్ అయిన ఆయన.. ఆ వెంటనే 'సైరా: నరసింహారెడ్డి' వంటి భారీ చిత్రాన్ని అందించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య'లో నటిస్తున్నారు. ఇది పట్టాలపై ఉండగానే మరో ముగ్గురు దర్శకులతో సినిమాలు చేస్తున్నట్లు ప్రకటించారాయన. అందులో 'లూసీఫర్' రీమేక్ ఒకటి. తాజాగా ఈ సినిమా విషయంలో చిరంజీవి వెనకడుగు వేసినట్లు ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది.

'హనుమాన్ జంక్షన్' ఫేం మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. మలయాళంలో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన 'లూసీఫర్'కు ఇది రీమేక్‌గా వస్తోంది. ఇప్పటికే ఈ మూవీ పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. కానీ, అనివార్య కారణాల వల్ల రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ మూడో వారం నుంచి దీన్ని స్టార్ట్ చేయాలని భావించారు. కానీ, ఇప్పుడా నిర్ణయాన్ని మార్చుకున్నారని తెలిసింది. కరోనా వైరస్ ప్రభావం పెరుగుతోన్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్‌ను పోస్ట్ పోన్ చేశారని సమాచారం.

Chiranjeevis Lucifer Remake Shooting Postponed

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో 'ఆచార్య' సినిమానే వాయిదా వేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే 'లూసీఫర్' రీమేక్‌ను కూడా కొద్ది రోజులు ఆపాలని చిరంజీవి.. మోహన్ రాజాకు సూచించారట. దీంతో ఆయన కాస్టింగ్ వ్యవహారంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాను రామ్ చరణ్, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విలక్షణ హీరో సత్యదేవ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. మిగిలిన నటీనటులపై అధికారిక ప్రకటనలు రాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X