Megastar Chiranjeevi: సెప్టెంబర్ 22వ తేదీన చిరంజీవికి గిన్నిస్ అవార్డు.. మెగాస్టార్ కి స్పెషల్ డే ఎందుకో తెలు

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకులు ఎవ్వరూ ఉండరు. ఎలాంటి బ్యాక్ రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన తన స్వయంకృషి, పట్టుదలతో ఎదిగారు. ఆయన తన కెరీర్ ప్రారంభం ఎన్నో సవాళ్లను అధిగమించి.. చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి మెగాస్టార్ స్థాయికి ఎదిగారు. తన నటప్రస్థానంలో ఎన్నో అవార్డు అందుకున్న చిరంజీవి మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. సినీ రంగంలోనే అత్యధిక పాటలకు డ్యాన్సులు వేసిన వ్యక్తిగా ప్రతిష్టాత్మక గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్స్‎లో నేడు(సెప్టెంబర్ 22 తేదీన) మెగాస్టార్ చిరంజీవి స్థానం సంపాదించుకున్నారు. అయితే.. యాధృచ్చికమో.. కాకతాళీయమో.. తెలియదు గానీ సెప్టెంబర్ 22 తేదీతో మెగాస్టార్ చిరంజీవికి ఓ ప్రత్యేక అనుబంధముంది. సెప్టెంబర్ 22 తేదీ మెగాస్టార్ చిరంజీవికి చాలా చాలా స్పెషల్ డే ఎందుకో తెలుసా..? ఆ వెరీ వెరీ స్పెషలేంటో మీరు కూడా ఓ లూక్కేయండి.

చిరంజీవి ఎలాంటి సపోర్టు, బ్యాక్ డ్రాప్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఎంతో కష్టపడి తొలిసారి 'పునాది రాళ్లు' సినిమాకు ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నికయ్యారు. తన నటనతో మెప్పించారు. ఆ తరువాత ' ప్రాణం ఖరీదు' సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్నారు. ఈ సమయంలో కొన్ని కారణాల వల్ల మొదట నటించిన పునాది రాళ్లు మూవీ కాకుండా ఆ తరువాత నటించి 'ప్రాణం ఖరీదు' ముందుగా విడుదలైంది. ఇలా చిరంజీవి ఇలా 'ప్రాణం ఖరీదు' సినిమాతో తొలిసారి వెండి తెరపై కనిపించారు. ఆయన డ్యాన్స్ టాలెంట్ ను గుర్తించిన మూవీ మేకర్స్ ఆయనకు ఓ ప్రత్యేకంగా పాటను రాయించి అందులో స్టెప్పులేయించారట. చిరంజీవి అలా తన అల్టిమేట్ డాన్స్ తో తెలుగు ప్రేక్షకులను పరిచయమయ్యారు.

Chiranjeevi s name entered the Guinness Book of Records Chiranjeevi has a special association on September 22

కెరీర్ ప్రారంభంలో చిరంజీవి సెకండ్ హీరోగా, సహాయ నటుడిగా, విలన్‌గా నటించారు. ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో1983లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ మూవీ చిరంజీవి కెరీర్ లో ఓ మైలురాయి అని చెప్పవచ్చు. ఈ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో చిరంజీవి స్టార్ డమ్ హోదా వచ్చింది. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్టేటస్ వచ్చింది ఈ హిట్ తోనే. ఈ సినిమా తర్వాత చిరంజీవి ఆచితూచి అడుగులేస్తూ.. వరుస హిట్లతో టాలీవుడ్ నెంబర్ వన్ హీరో మారారు. కేవలం మాస్ మూవీస్ తోనే కాకుండా.. మధ్యతరగతి జీవితాలకు ఆకట్టుకునే కథలలో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా దగ్గరయ్యారు.

చిరంజీవి తన ఒక్కో సినిమాలో ఒక్కొక్క యాక్టింగ్‌లో వేరియేషన్స్ చూపెడుతూ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అప్పటికే సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి స్టార్ హీరోలతో పోటీ పడి నిలిచారు. కేవలం డ్యాన్స్, ఫైట్స్ కాదు.. చిరంజీవి తన కామెడీ టైమింగ్ తో అదుర్స్ అనిపించారు. ఇలా చిరంజీవి తనను తాను మలుచుకున్న తీరే అతన్ని మెగాస్టార్ గా నిలబెట్టింది. ఒకనొక సమయంలో భారతదేశంలో రూ.కోటికి పైగా పారితోషికం తీసుకున్న తొలి నటుడు చిరంజీవి నిలిచారంటే అతిశయోక్తి కాదు. అలాగే.. దాదాపు మూడు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో నంబర్ 1 స్థానంలో కొనసాగారు చిరంజీవి.

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో నాలుగు నంది అవార్డులు, 9 ఫిల్మ్‌ఫేర్ సౌత్ పురస్కారాలు, ఆంధ్రా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ చిరంజీవి అందుకున్నారు. సినీరంగంలో ఆయన చేసిన సేవలకు గాను దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లతో గౌరవించింది భారత ప్రభుత్వం. అలాగే ఈ ఏడాది మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా 'ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్‌'ను చిరంజీవి అందుకున్నారు.మెగాస్టార్ చిరంజీవి ఖాతాలోకి నేడు మరోక విశిష్ట గౌరవం వచ్చి చేరింది. చిరంజీవి తన సినిమా కెరీర్ లో 156 సినిమాలో 537 పాటలకు 24,000 డ్యాన్స్ మూవ్స్ చేసినందుకుగానూ నేడు (సెప్టెంబర్ 22 ) మెగాస్టార్ పేరు గిన్నిస్ రికార్డులోకెక్కింది.

ఇది యాధృచ్చికమో.. కాకతాళీయమో.. తెలియదు గానీ మెగాస్టార్ చిరంజీవికి సెప్టెంబర్ 22 తేదీతో ఓ ప్రత్యేక అనుబంధముంది. సరిగ్గా 46 ఏండ్ల క్రితం.. సరిగ్గా ఇదే రోజు అంటే.. 1978 సెప్టెంబర్ 22 న చిరంజీవి నట ప్రస్థానం ప్రారంభమైంది. ఆయన నటించి ప్రాణం ఖరీదు మూవీ ఈ రోజే విడుదలైంది. వాస్తవానికి చిరంజీవి నటించిన మొదట 'పునాది రాళ్లు' అయినా.. ఆ తరువాత నటించిన ప్రాణం ఖరీదు సినిమా మొదట రిలీజైంది. అంటే.. చిరంజీవి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేటితో 46 సంవత్సరాలు పూర్తయ్యాయి. సరిగ్గా ఇదే రోజు (సెప్టెంబర్ 22) మెగాస్టార్ చిరంజీవి పేరు గిన్నిస్ రికార్డులోకెక్కింది. ఈ తరుణంలో చిరంజీవి అభిమానులు.. 'సెప్టెంబర్ 22వ తేదీ మెగాస్టార్ కి స్పెషల్ డే' అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తూ పోస్టులు పెడుతున్నారు.

More from Filmibeat

Read more about: megastar chiranjeevi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X