Chiranjeevi Vs Balakrishna: బాలయ్యతో చిరంజీవి బాక్సాఫీస్ వార్? ఆయనదే పైచేయి అవుతుందా?
తెలుగు సినిమా దగ్గర ఎంతమంది హీరోల నడుమ పోటీలు ఉన్నప్పటికీ కొంతమంది హీరోల నడుమ ఎపిక్ క్లాష్ లు మాత్రం ఇపుడు జెనరేషన్ చూసి ఉండదు అని చెప్పాలి. అయితే ఇపుడు ఫ్యాన్ వార్స్ అంతా మరీ నీచంగా పోతున్నాయి కానీ మన సీనియర్ హీరోల అభిమానుల నడుమ ఫ్యాన్ వార్స్ మాత్రం ఇపుడు ఉన్న రీతి నీచంగా ఉండేవి కాదని చెప్పవచ్చు.
ఆ హీరోస్ లానే వారి వార్స్ కూడా ఒకింత హుందా గానే ఉండేవి. మరి ఇలా తెలుగు సినిమా దగ్గర ఎపిక్ క్లాష్ అంటే అది ఒకపుడు మెగాస్టార్ చిరంజీవి అలాగే నందమూరి హీరో బాలకృష్ణల నడుమ బాక్సాఫీస్ యుద్ధమే అని చెప్పవచ్చు. ఒక రెండున్న దశాబ్దాల కితం వరకు ఇద్దరు హీరోల మార్కెట్ దాదాపు ఒకేలా ఉండేది. ఇద్దరికీ సాలిడ్ ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి.

కానీ మెగాస్టార్ గ్రాఫ్ మాత్రం కాలంతో పాటుగా బాగా పెరిగింది. కానీ తర్వాత చిరు పాలిటిక్స్ అని మళ్ళీ వెనక్కి రావడం పలు రీమేక్ సినిమాలతో తన మార్కెట్ ని డ్యామేజ్ చేసుకున్నారని చెప్పక తప్పదు. అయినప్పటికీ తన నుంచి మంచి టాక్ పడితే ఎలా ఉంటుందో వాల్తేరు వీరయ్య సినిమా చూపించింది. ఇక బాలయ్య కూడా ఇపుడు బాగా అప్డేట్ అయ్యారు.
తన సినిమాలు అంతకంతకూ ఆడియెన్స్ కి నచ్చేలా వస్తున్నాయి. ఒకప్పుడు ట్రోల్ మెటీరియల్ గా అనిపించే బాలయ్య సినిమాలు ఇపుడు పాన్ ఇండియా ఆడియెన్స్ కి రీచ్ అవుతున్నాయి. పైగా ఇపుడు వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ హిట్స్ తో బాలయ్య ఫామ్ మామూలుగా కూడా లేదు. దీనితో మళ్ళీ ఈ ఇద్దరు హీరోల నడుమ యుద్ధం పాత రోజుల్లా మారింది.
కాగా వాల్తేరు వీరయ్య క్లాష్ లో చిరంజీవి గెలిచారు కానీ ఇపుడు కొన్ని ఇంట్రెస్టింగ్ రూమర్స్ వీరిపై మొదలయ్యాయి. చిరంజీవి నటిస్తున్న అవైటెడ్ సినిమా విశ్వంభర బాలయ్య ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ అఖండ కి సీక్వెల్ తో పోటీకి వస్తుంది అంటూ పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో ఇది మాత్రం చిరంజీవికే రిస్క్ అని బాలయ్య అభిమానులు అంటున్నారు.
కాగా నిజానికి ఇపుడు విశ్వంభర కంటే అఖండ 2 పైనే పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. విశ్వంభరపై కూడా మొదట్లో గట్టి హైప్ ఉండేది కానీ ఆ మధ్య వచ్చిన గ్లింప్స్ మొత్తం మార్చేసింది. అందుకే మేకర్స్ ఈపాటికే రిలీజ్ కావాల్సిన సినిమాని ఆపి మళ్ళీ గ్రాఫిక్స్ వర్క్ చేస్తున్నారు. ఈ ఎదురు దెబ్బ అఖండ 2 కి ప్లస్ అయ్యింది. పైగా సీక్వెల్ కూడా కావడంతో ఆడియెన్స్ కూడా బాలయ్య సినిమా వైపే ఎక్కువ చూస్తున్నారు.
దీనితో ఈసారి గాని బాక్సాఫీస్ క్లాష్ ఇద్దరు బిగ్ స్టార్స్ నడుమ జరిగితే బాలయ్యదే పై చేయి అవుతుంది అని ఇపుడు నుంచే రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో ఈ ఎపిక్ బాక్సాఫీస్ క్లాష్ ఎంతవరకు నిజం అవుతుంది అనేది ఆసక్తిగా మారింది. కాగా బాలయ్య అఖండ 2 ని మేకర్స్ సెప్టెంబర్ 25కి లాక్ చేయగా చిరు సినిమా ఇంకా ముందే రావచ్చు అంటున్నారు కానీ మళ్ళీ సెప్టెంబర్ పై కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











