చెన్నై నుంచి నేరుగా బాబాయ్ హోటల్‌‌కి.. హీరో విక్రమ్‌కి బెజవాడలో పనేంటీ..?

ఇండియాలో ఏ మూలకు వెళ్లినా అక్కడ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. భిన్న సంస్కృతులు, ఆచారాలకు కేంద్రమైన మనదేశంలో ప్రతి ప్రాంతానికి చరిత్ర ఉంటుంది. ఇక అనాదిగా భారతీయులు భోజన ప్రియులు కావడంతో ప్రతి ఊళ్లోనూ నోరూరించే రుచులెన్నో. హైదరాబాద్ బిర్యానీ, బందరు లడ్డు, మాడుగుల హల్వ, ఆత్రేయపురం పూతరేకులు, కాకినాడ కాజ ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో . అలాగే కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు దశాబ్ధాలుగా కడుపు నింపుతూ వాటి బ్రాండ్ వాల్యూను నిలబెట్టుకుంటున్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా, నవ్యాంధ్ర అయినా తెలుగునాట రాజకీయ, ఆర్ధిక, ఆధ్యాత్మిక, వర్తక, వాణిజ్య, చారిత్రక, సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లుతోంది విజయవాడ. సిరుల తల్లి కనకదుర్గమ్మ పాదాల చెంత, కృష్ణమ్మ పావన స్పర్శతో అలరారుతోంది బెజవాడ. ఈ నగరంలో ఎన్నో పర్యాటక కేంద్రాలున్నాయి. పసందైన వంటకాలకు , అచ్చ తెలుగు వంటకాలకు విజయవాడ కేంద్రం. నగరంలో ఎన్నో హోటళ్లు, రెస్టారెంట్లు దశాబ్థాలుగా ప్రజల కడుపునింపుతున్నాయి.

chiyaan Vikram Along with thangalaan movie team visits babai hotel in vijayawada

అలాంటి వాటిలో ఒకటి బాబాయ్ హోటల్. నగరంలోని గాంధీనగర్‌లో ఉన్న ఈ హోటల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్. ఎంతగా అంటే హాస్య బ్రహ్మా జంధ్యాల ఏకంగా బాబాయ్ హోటల్ అని సినిమా కూడా తీశారంటే దీని స్పెషాలిటీని అర్ధం చేసుకోవచ్చు. విజయవాడ వచ్చిన వారు ఎవరైనా సరే ఇక్కడ అల్పాహారం తిని వెళ్లాల్సిందే. ముఖ్యంగా ఇక్కడి ఇడ్లీ బాగా పాపులర్. ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు బాబాయ్ హోటల్‌లో టిఫిన్ చేసినవారే.

తాజాగా చెన్నై నుంచి ఓ స్టార్ హీరో ఓ నలుగురిని వెంటేసుకుని బాబాయ్ హోటల్‌ను వెతుక్కుంటూ వచ్చి టిఫిన్ చేసి వెళ్లాడు. ఆయన ఎవరో కాదు.. కోలీవుడ్ అగ్రనటుడు చియాన్ విక్రమ్. పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ , మాళవిక నటించిన తంగలాన్ చిత్రం ఆగస్ట్ 15న విడుదల కానుంది. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో పనిచేసే కార్మికులు, వారు పడే కష్టాలను ఆధారంగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా చిత్ర యూనిట్ సోమవారం బెజవాడలో సందడి చేసింది. పనిలో పనిగా విక్రమ్ , మాళవిక, డేనియల్‌ మరికొందరు కలిసి వరల్డ్ ఫేమస్‌ బాబాయ్ హోటల్‌‌‌కు చేరుకుని టిఫిన్ చేస్తూ అక్కడి సిబ్బంది, ప్రజలతో కాసేపు ముచ్చటించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. స్టార్ హీరో అయ్యుండి.. ఏ ఫైవ్‌ స్టార్ హోటల్‌కో వెళ్లకుండా మన బాబాయ్ హోటల్‌కు వచ్చాడంటూ విక్రమ్‌పై బెజవాడ వాసులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X