విక్రమ్ ప్రాణం పోశాడు.. సినిమాకి అదే హైలైట్!
నటుడిగా ప్రయోగాలు చేస్తూ, విలక్షణమైన నటనతో ఆకట్టుకోవడంలో విక్రమ్ ముందువరుసలో ఉంటాడు. ఎలాంటి పాత్ర అయినా సరే పరకాయ ప్రవేశం చేసి నటించడం విక్రమ్ కు అలవాటు. ప్రస్తుతం లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న 'కోడరామ్ కొండాన్' చిత్రంలో విక్రమ్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో విక్రమ్ సరసన కమల్ చిన్న కుమార్తె అక్షర హాసన్ నటిస్తోంది.
ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీత దర్శకుడు. జిబ్రాన్ మాట్లాడుతూ ఆసక్తికర విషయం తెలియజేశాడు. విక్రమ్ ఈ చిత్రంలో ఓ పాట పాడారు. ఆ పాటకు వివేకా సాహిత్యం అందించారు. విక్రమ్ తన గాత్రంతో పాటకు ప్రాణం పోశాడు అని జిబ్రాన్ ప్రశంసించాడు. సినిమాకే ఈ సాంగ్ హైలైట్ గా నిలుస్తుంది. గతంలో కూడా పలుమార్లు విక్రమ్ సాంగ్స్ పాడాడు.

మల్లన్న, సామి స్క్వేర్ లాంటి చిత్రాల్లో అద్భుతమైన పాటలు పాడి విక్రమ్ అందరిని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. కోడరామ్ కొండాన్ చిత్రం రాజేష్ సెల్వ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ నెలాఖరులో ఈ చిత్ర టీజర్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











