నాగార్జున డిజిటల్ ఎంట్రీపై క్లారిటీ: చేసేది వెబ్ సిరీస్ కాదు.. వాళ్లతో కలిసి ప్లాన్

ఈ మధ్య కాలంలో వరుసగా ఫ్లాపులను చవి చూస్తూ ఇబ్బందులు పడుతున్నాడు కింగ్ అక్కినేని నాగార్జున. ఈ క్రమంలోనే రిజల్ట్‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయినప్పటికీ ఆయనకు పెద్దగా ఫలితం దక్కడం లేదు. ఇటీవల విడుదలైన 'వైల్డ్ డాగ్' మూవీ ప్రేక్షకుల మెప్పు పొందినప్పటికీ.. కమర్షియల్‌గా విజయాన్ని అందుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం నాగ్.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీనితో పాటు తన డ్రీమ్ ప్రాజెక్టు 'బంగార్రాజు'నూ ప్లాన్ చేస్తున్నాడు. అదే సమయంలో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

అక్కినేని నాగార్జున ఓటీటీ సంస్థ కోసం డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని కొద్ది రోజులుగా ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలోనే ఆయన వెబ్ సిరీస్‌లో నటించబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. నాగార్జున ఓటీటీ ఎంట్రీ ఇచ్చేది నిజమేనని తెలిసింది. అంతేకాదు, ఆయన చేసేది వెబ్ సిరీస్ కాదని, సినిమా అని తెలుస్తోంది. సరికొత్త కంటెంట్‌తో ఇది తెరకెక్కబోతుందని అంటున్నారు. ఇప్పటి వరకూ కనిపించని పాత్రలో ఈ సీనియర్ హీరో నటిస్తున్నాడట. ఈ విషయాన్ని అన్నపూర్ణ స్టూడియో వర్గాలు ధృవీకరిస్తున్నాయి.

Clarity about Akkineni Nagarjuna OTT Entry

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అక్కినేని నాగార్జున.. విలక్షణ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ మూవీని చేస్తున్నాడు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. ఇది పట్టాలపై ఉండగానే 'బంగార్రాజు' అనే చిత్రాన్ని కూడా పట్టాలెక్కించనున్నాడు. వీటితో పాటు కొన్ని చిత్రాలను ప్రొడ్యూస్ చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియోలో ఓనమాలు నేర్చుకున్న యువ దర్శకుల కథలను కూడా వింటున్నాడట. వీటితో పాటు త్వరలోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఐదో సీజన్‌కు హోస్టుగానూ చేయబోతున్నాడని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X