ఏంటీ.. Rajamouli సినిమాలో Chiranjeeviకి డూప్‌గా చేసింది ఆ కమెడియనా?
రాజమౌళి తెరకెక్కించిన సినిమాలో చిరంజీవికి ఓ కామెడియన్ డుప్ గా చేశారు అనే విషయం మీకు తెలుసా.. అదేంటి రాజమౌళి సినిమాలో చిరంజీవి ఎప్పుడు నటించాడు అని ఆశ్చర్యపోతున్నారా... అవునండి నిజమే రాజమౌళి సినిమాలో చిరంజీవి నటించారు. కానీ ఫుల్ లెంగ్త్ సినిమా కాదు.. అయితే ఆ సినిమా ఏంటి.. చిరంజీవికి డుప్ గా ఎవరు చేశారు అనే వివరాల్లోకి వెళితే...
స్టార్ హీరోగా: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మగధీర. ఇందులో రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించగా.. కాజల్ హీరోయిన్ గా చేసింది. ఇక ఈ సినిమా అప్పట్లోనే పాన్ ఇండియా లెవెల్ లో రాజమౌళి తెరకెక్కిద్దామని అనుకున్నారని సమాచారం. అయితే కొన్ని కారణాల చేత ఆ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించ లేకపోయారు. అయితే ఈ సినిమాతో రామ్ చరణ్ ఒక్క సారిగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారిపోయారనే విషయం తెలిసిందే.

చిరంజీవికి డూప్: ఇక ఈ సినిమాతో కాజల్ ఆగర్వాల్ కు కూడా మంచి స్టార్ డమ్ తీసుకువచ్చింది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తన తండ్రి పాట బంగారు కోడిపెట్టను రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ పాటలో చిరంజీవి కాసేపు కనిపించి డ్యాన్స్ చేస్తారు. అయితే ఈ సినిమాలో చిరంజీవి నటించలేదట. చిరంజీవికి ఆ టైంలో వేరే పనులు ఉండడం వల్ల ఆ సినిమా లో చిరంజీవి నటించ లేదని సమాచారం.

ప్రభాస్ శ్రీను: మరి చిరంజీవి ప్లేస్ లో చిరుకు డూప్ గా నటించింది ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవచ్చు. అయితే చిరంజీవి ప్లేస్ లో ఉన్నది నటుడు ప్రభాస్ శ్రీన్. అయితే ప్రభాస్ శ్రీను చిరంజీవి క్యారెక్టర్ లో చేయడానికి ప్రధాన కారణం ఆ సినిమా షూటింగ్ లో ప్రభాస్ శ్రీను చిరంజీవి లాగే ఇమిటేట్ చేస్తూ కనిపించారని తెలుస్తోంది. దీంతో మేకర్స్.. ప్రభాస్ శ్రీను కాల్ చేసి.. ఇలా చేయాలని కోరారట.

న్యూస్ వైరల్: దాంతో చిరంజీవి ప్లేస్ లో ప్రభాస్ శ్రీను నటించాడు. ఇక ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నప్పుడు ప్రభాస్ శ్రీను కూడా స్వయం గా చెప్పుకొచ్చాడు. చిరంజీవికి డూప్ గా చేయడం తన అదృష్టం అని వెల్లండించాడు. ఇక చిరంజీవి వేసుకున్న డ్రెస్ తనదేనని చెప్పాడు. ఆ డ్రెస్ అలాగే దాచుకోవాలని అనుకున్నట్లు తెలిపాడు. కానీ ఆ డ్రెస్ మిస్ అయిందని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ గా మారింది.
ఇక మగధీర సినిమా విషయానికి వస్తే.. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, కాజల్ ఆగర్వాల్, శ్రీహరి ప్రధాన పాత్రలుగా సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కించారు. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ రికార్డ్స్ ను ఈ సినిమా బ్రేక్ చేసింది.


Click it and Unblock the Notifications











