Don't Miss!
- News
ముఖ్యమంత్రి విశాఖకు మారే అధికారం ఉంది - బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు..!!
- Sports
డోపింగ్ టెస్టులో ఫెయిలైన భారత జిమ్నాస్ట్.. క్షమాపణలు చెప్పిన క్రీడాకారిణి!
- Lifestyle
Super Brain Yoga: సూపర్ బ్రెయిన్ యోగా, దీంతో ఎన్నో ఉపయోగాలున్నాయ్.. తెలుసా?
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
చావుబతుకుల్లో సినీ రచయిత.. రూ.లక్ష సాయం చేసిన కమెడియన్ సప్తగిరి
కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో సినీ ప్రముఖులు, యువ కళాకారులు, రచయితలు విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుపోతున్నారు. యువ డైరెక్టర్లు వట్టి కుమార్, శ్రవణ్ మ్యత్యువాత పడటంతో పరిస్థితి గంభీరంగా మారింది. ఈ క్రమంలో సినీ యువ రచయిత నంద్యాల రవి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఈ క్రమంలో ఆయనకు చేయూతగా నిలిచేందుకు అందరూ ముందుకు వస్తున్నారు.
కళ్ళతోనే మత్తు మందు జల్లుతున్న మేఘాలి
కరోనావైరస్ కారణంగా ఏప్రిల్ చివరి వారంలో హాస్పిటల్ చేరిన నంద్యాల రవి ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తున్నది. దాంతో చిరంజీవి స్పందించి కావాల్సిన రక్తం, ప్లాస్మాను ఏర్పాటు చేశారు. అయితే హాస్పిట్ బిల్లులు సుమారు రూ.6 లక్షలకు చేరుకోవడం, ఆ మొత్తాన్ని చెల్లించే స్థోమత కుటుంబ సభ్యులకు లేకపోవడంతో కమెడియన్ సప్తగిరి స్పందించారు.

ఈ క్రమంలో తన మిత్రుడు, నంద్యాల రవి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొన్న కమెడియన్, నటుడు సప్తగిరి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. రవి హాస్పిటల్ బిల్లులు చెల్లించడానికి రూ.1 లక్షల ఆర్థిక సహాయం చేశారు. దీంతో మరికొందరు కూడా సహాయం అందించడానికి ముందుకు వస్తున్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా, నంద్యాల రవి ఇటీవల పవర్ ప్లే, లక్ష్మీ రావే మా ఇంటికి సినిమాలకు పనిచేశారు. ఇక సప్తగిరి విషయానికి వస్తే.. ఇటీవల ఒరేయ్ బుజ్జిగా, అల్లు అదుర్స్, ఇదే మా కథ, ఏక్ మిని కథ చిత్రాల్లో నటించారు.