రామ్ చరణ్ చేసిన సహాయానికి గెటప్ శ్రీను గుడి కట్టేస్తాడు: కమెడియన్ సత్య

ఈ రోజుల్లో కొంత సహాయం చేసి కొండంత ప్రచారాలు చేసుకునేవారు చాలా మంది ఉంటారు. మరికొందరు మాత్రం కొంచెం కూడా ఆ విషయాలను బయటకు రానివ్వరు. ఇక అలాంటి స్టార్ హీరోలలో రామ్ చరణ్ కూడా ఉన్నాడు. మెగా వారసుడిగా ఓ వైపు మెగాస్టార్ చిరంజీవి నట వారసత్వాన్ని మరోవైపు బాబాయ్ పవన్ కళ్యాణ్ మంచి తనాన్ని సమానంగా చూపిస్తున్నాడు. ఇటీవల కమెడియన్ సత్య ఎవరికి తెలియని విషయాలను బయటపెట్టాడు.

 హడావుడి చేయకుండా

హడావుడి చేయకుండా

హీరోగా అత్యున్నత స్థాయికి ఎదిగినా కూడా మంచి మనసు లేకపోతే ఆడియెన్స్ అలాంటి హీరోలను ఏ మాత్రం పట్టించుకోరు. ఇక మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ స్టార్ హీరో కంటే ఒక మంచి మనసున్న హీరోగా గుర్తింపు అందుకుంటున్నాడు. చేసిన సహాయంపై ఏ రోజు సింగిల్ ట్వీట్ కూడా చేసింది లేదు. ఎవరైనా కష్టాల్లో ఉన్నట్లు తెలిస్తే వెంటనే సహాయం చేయడానికి ముందుకొస్తాడు.

ఎవరికి తెలియకుండా

ఎవరికి తెలియకుండా

లాక్ డౌన్ లో విరాళాలు ఇవ్వడమే కాకుండా ఎవరికి తెలియకుండా కూడా రామ్ చరణ్ చాలా మంది సినీ కార్మికులకు సహాయం చేశాడు. అయితే ఇటీవల శ్రీకారం కోసం కమెడియన్ సత్య ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గురించి తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. చేసిన సహాయాన్ని మరో వ్యక్తికి కూడా చెప్పుకోరు. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారని అన్నాడు.

శర్వానంద్ కోసం..

శర్వానంద్ కోసం..

శ్రీకారం సినిమాకు ఒక విధంగా ఫుల్ సపోర్ట్ ఇచ్చిన వారిలో రామ్ చరణ్ ఒకరని మెగాస్టార్ చిరంజీవి సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు వెళ్ళడానికి ప్రధాన కారణం రామ్ చరణ్ అని చెప్పారు. శర్వానంద్ కోసం మీరు వెళ్లాల్సిందే అంటూ చిరుని పంపించారని చిత్ర దర్శకుడు కిషోర్ వివరణ ఇచ్చారు.

 అతనైతే రామ్ చరణ్ కు గుడి కట్టేస్తాడు

అతనైతే రామ్ చరణ్ కు గుడి కట్టేస్తాడు

ఇక రామ్ చరణ్ చాలా మందికి ఆర్థికంగా హెల్ప్ చేశారని చెప్పిన సత్య.. ఒకనొక సమయంలో ఆర్టిస్ట్ గా స్త్రగుల్ అవుతున్నప్పుడు తనకు కూడా డబ్బులు ఇచ్చి సహాయం చేశారని అన్నాడు. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా ప్రచారాలు చేసుకోవడం ఆయనకు ఏ మాత్రం ఇష్టం ఉండదు. గెటప్ శ్రీనుకి కూడా సహాయం చేశారు. అతనైతే రామ్ చరణ్ కు గుడి కట్టేస్తాడు అని కమెడియన్ సత్య వివరణ ఇచ్చారు.

Recommended Video

OTT లో Latest Telugu Movies | Zombie Reddy రిలీజ్ ఇన్ Aha
 కలిసి భోజనం చేసేవారు

కలిసి భోజనం చేసేవారు

రామ్ చరణ్ నిజంగా చాలా సింపుల్ గా ఉంటారని చెబుతూ.. రంగస్థలం సినిమాలో మేము ఆయనతో కలిసి వర్క్ చేసినప్పుడు మాతో ఈజీగా కలిసిపోయేవారు. ఎక్కడా కూడా స్టార్ హోదాను చూపించకుండా మాతో కలిసి భోజనాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మెగా పవర్ స్టార్ చాలా మంచి మనసున్న వ్యక్తి అని సత్య తెలియజేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X