అది ఫేక్ న్యూస్, నేను చనిపోలేదు.. బాగానే ఉన్నాను: కమెడియన్ సుధాకర్ వివరణ
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీల మీద ప్రతి ఒక్కరు రకరకాల రూమర్స్ క్రియేట్ చేసి వాటిని వైరల్ చేయడం అలవాటుగా మారిపోయింది. ఎవరైనా సెలబ్రిటీ ఒకరు బయటకి కనిపించకుండా ఉంటే ఏకంగా వారు అనారోగ్యంతో ఉన్నారనో, లేదంటే చనిపోయారానో వార్తలు ప్రచారం చేస్తారు. వీటిపై ఆ సెలబ్రిటీలు అ మరల మీడియా ముందుకొచ్చి లేదంటే ప్రకటనల ద్వారానో వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఇక సీనియర్ నటుడు సుధాకర్ పై కూడా అలాంటి వార్తలు రావడంతో వెంటనే ఆయన క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..
ఆ మధ్య శరత్ బాబుపై కూడా..: ఇటీవల సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆయన బ్రతికి ఉన్నప్పుడు కూడా తప్పుడు వార్తలు వచ్చాయి. కొంతకాలం క్రితం శరత్ బాబు హాస్పిటల్ లో ఉన్న సమయంలో చనిపోయినట్లు కథనాలు ప్రసారం చేశారు. చికిత్స తీసుకుంటున్న సమయంలోనే ఆ విధంగా వార్తలు రావడం వలన ఆ మధ్య అందరూ కంగారు పడ్డారు. ఇక ఆయన సోదరి క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.

క్లారిటీ ఇచ్చిన సుధాకర్: ఇదిలా ఉంటే గత కొద్ది రోజుల నుంచి సీనియర్ స్టార్ యాక్టర్ సుధాకర్ కండిషన్ సీరియస్ గా ఉందని కొదరు, అతని చనిపోయాడని మరికొందరు సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ వార్తలు కాస్తా వైరల్ అయ్యాయి. దీంతో సుధాకర్ నేను చనిపోలేదని క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో కూడా ఆయన అనారోగ్యంతో ఇబ్బంది పడినప్పటికి వెంటనే కోలుకున్నారు.
నేను పూర్తి ఆరోగ్యంతో సంతోషంగా ఉన్నా..: ఇక ఇటీవల మళ్ళీ సోషల్ మీడియాలో అలాంటి వార్తలు రావడంతో తనపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని సుధాకర్, ఫేక్ న్యూస్ నమ్మోద్ధంటూ క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి తప్పుడు వార్తలని ప్రచారం చేయొద్దని, నేను పూర్తి ఆరోగ్యంతో సంతోషంగా ఉన్నా, ఇలాంటి వార్తలు ప్రచారం చేసే ముందు పూర్తిగా తెలుసుకొని రాస్తే మంచిదంటూ సుధాకర్ చెప్పుకొచ్చారు.

ఫేక్ న్యూస్ రావడంతో..: గతంలో కూడా ఇదే రీతిలో సుధాకర్ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు అంటూ ప్రచారం చేశారు. దానిపై అప్పుడు కూడా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మరల ఇప్పుడు ఏకంగా చనిపోయారంటూ ఫేక్ న్యూస్ ని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం విశేషం. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవికి ఇండస్ట్రీలో ఉన్న అతికొద్ది మంది ఆప్తమిత్రులలో సుధాకర్ కూడా ఒకరు.

చిరంజీవితో స్నేహం.. హీరోగా ప్రయత్నం: చెన్నైలో ఇద్దరు ఒకే గదిలో ఉంటూ అవకాశాల కోసం ప్రయత్నం చేశారు. చిరంజీవి కంటే ముందుగానే సుధాకర్ తమిళంలో హీరోగా తెరంగేట్రం చేశారు. తరువాత ఆ ఇమేజ్ ని కొనసాగించలేకపోయారు. తెలుగులో కమెడియన్ గా, విలన్ గా టర్న్ తీసుకొని సక్సెస్ అయ్యారు. సుదీర్ఘ కాలం పాటు ఇండస్ట్రీ లో సక్సెస్ ఫుల్ కమెడియన్ గా సుధాకర్ కొనసాగారు. గత కొన్నేళ్ళ నుంచి సినిమాలకి దూరంగా ఉంటున్నారు.


Click it and Unblock the Notifications











