ప్రభాస్‌ను తెగ వాడేస్తున్న వేణు స్వామి భార్య.. టాప్ జ్యోతిష్కుడు భలే ఫ్లాన్ వేశాడుగా?

వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి, ఆయన భార్య ఇటీవల కాలంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను వాడుకుంటూ ఫుల్ గా పాపులర్ అయిపోతున్నారు. వేణు స్వామి అంటే ప్రభాస్ జాతకం గురించి సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు. మరి ఆమె భార్య ఏం చేసింది? అనే ఇంట్రెస్టింగ్ విషయంపై ఓ కన్నేద్దాం పదండి.

వేణు స్వామి సెలబ్రిటీల జీవితాల గురించి జ్యోతిష్యం చెబుతూ పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఆయన జాతకాన్ని నమ్మే ఎంతోమంది సెలెబ్రిటీలు వేణు స్వామితో ప్రత్యేక పూజలు సైతం చేయించుకుంటారు. ఇక ఆయన పూజల్లో తీర్థంగా మందును వాడడం మరో ఇంట్రెస్టింగ్ విషయం. సెలబ్రిటీలే కాదు రాజకీయ నాయకుల జీవితాల గురించి కూడా జోస్యం చెప్తాడు వేణు స్వామి. రీసెంట్ గా వేణు స్వామి నయనతారకు పిల్లలు పుట్టరని సెన్సేషనల్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. అయితే అందరి కంటే ఎక్కువగా ఆయన ప్రభాస్ గురించి చేసిన కామెంట్సే వైరల్ అయ్యాయి.

Controversial astrologer Venu Swamy and his wife veena srivani getting popularity by using Prabhas Name

ప్రభాస్ వ్యక్తిగత జీవితం గురించి వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ఆయన అభిమానులను హర్ట్ చేశాయి. దీంతో ఆయనపై ట్రోలింగ్ తో విరుచుకుపడ్డారు రెబల్ స్టార్ అభిమానులు. ప్రభాస్ కి పెళ్లి జరగదు, సలార్ ప్లాఫ్ అవుతుంది, ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి అంటూ ఎప్పటికప్పుడు వివాదాల్లో నిలిచారు వేణు స్వామి. అలా ప్రభాస్ అంటే తనకేమీ కోపం లేదు అంటూనే ఆయన భవిష్యత్తు గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసి రెబల్ స్టార్ అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యారు.

ఏదైతేనేం మొత్తానికి ప్రభాస్ ను అడ్డు పెట్టుకుని వేణు స్వామి బాగానే పాపులర్ అయ్యారు. ఇక ఇప్పుడు ఆయన భార్య వంతు వచ్చింది. వేణు స్వామి ఏమో ఇలా ప్రభాస్ పై నెగిటివ్ కామెంట్స్ చేసి ఫ్యాన్స్ కు కోపం తెప్పిస్తే, ఆయన భార్య మాత్రం ప్రభాస్ కు బహుమతులు పంపుతున్నాను అంటూ సోషల్ మీడియా ద్వారా పాపులారిటీని దక్కించుకుంటుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వేణు స్వామి భార్య వీణ శ్రీవాణి రీసెంట్ గా పోస్ట్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. తమ తోటలో పండించిన సీతాఫలాలను ప్రభాస్ కు పంపామని, అవి ఆయనకు బాగా నచ్చడంతో మళ్లీ పంపాలని ప్రభాస్ అడిగారంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చింది శ్రీవాణి.

Controversial astrologer Venu Swamy and his wife veena srivani getting popularity by using Prabhas Name

ఇక ఓ బుట్టలో ఉన్న పళ్ళను చూపిస్తూ అందులో ఉన్న సీతాఫలాలు అన్నీ డార్లింగ్ ప్రభాస్ కేనని, వాటితో పాటే చేతితో చేసిన ఆర్గానిక్ బ్యాగ్ ని తన గుర్తుగా పంపిస్తున్నాను అంటూ ఆమె పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. శ్రీవాణి ఆ వీడియోను పోస్ట్ చేసి దాదాపు వారం పూర్తయిపోయినా ఇంకా వైరల్ కావడం ఆగట్లేదు.

మొత్తానికి ఈ భార్యాభర్తలు ఇద్దరూ ప్రభాస్ ను వాడుకుని తెగ పాపులర్ అవుతున్నారు అంటున్నారు నెటిజన్లు. మరోవైపు ఆయన కామెంట్స్ ను ప్రభాస్ కుటుంబ సభ్యులు కొట్టిపారేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X