రియల్ హీరో.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న అఖిల్!
అఖిల్ అక్కినేని పుట్టిన రోజు రేపు (ఏప్రిల్ 8). ఈ సందర్భంగా అభిమానులందరికీ ఓ సందేశాన్ని ఇచ్చాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో అఖిల్ చెప్పిన విషయాలు, తీసుకున్న నిర్ణయాలు, ఇచ్చిన సలహాలు చూస్తుంటే రియల్ హీరో అని అనక మానరు. ఇంతకీ అఖిల్ ఏం చెప్పాడో ఓ సారి చూద్దాం.
తన పుట్టిన రోజు అని సెలెబ్రేషన్స్ చేయవద్దని తన అభిమానులకు సూచించాడు. రేపు ఎలాంటి అప్‌డేట్స్ టీజర్ వంటివి కూడా రిలీజ్ చేయడం లేదని బాంబ్ పేల్చాడు. ఇలాంటి విపత్కర సమయంలో అలాంటివి ఏమీ వద్దని దర్శక నిర్మాతలతో వారించానని తెలిపాడు. తాను రేపు ఫ్యామిలీతో ఓ పిక్ దిగి పోస్ట్ చేస్తానని, మీరంతా కూడా అలాగే చేయాలని అభిమానులకు సూచించాడు. ఇంట్లోనే ఉండండని క్షేమంగా ఉండండని సూచించాడు.

అయితే ఈ నిర్ణయం అక్కినేని అభిమానులకు కాసింత నిరాశనే కలిగించవచ్చు గానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అఖిల్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నెటిజన్స్ మాత్రం హ్యాట్సాఫ్ చెప్పేస్తున్నారు. కరోనాను ఎదురించేందుకు అందరూ ఒకటిగా పోరాడలని, ఇంట్లోనే ఉండాలని చెప్పిన మాటలకు, అఖిల్ తీసుకున్న నిర్ణయాలకు అందరూ ఫిదా అయ్యారు. రియల్ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











