ఇంట్లో మీలాగే ఉండండి.. మంచు మనోజ్ న్యూ లుక్ వైరల్
మంచు ఫ్యామిలీ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మనోజ్ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా యాక్టర్‌గా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. ఈ మధ్యే వివాహ బంధానికి స్వస్తి చెప్పి కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఇక నుంచి తన జీవితం సినిమాకే అంకితమని చెప్పి బిజీగా అయిపోయాడు.
సొంత ప్రొడక్షన్ హౌస్ పెట్టి అందులో వరుసగా ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కించాలని మనోజ్ ఫిక్స్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే అహం బ్రహ్మాస్మి అనే ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ పోస్టర్, మనోజ్ ఫస్ట్ లుక్ ఓ రేంజ్‌లో వైరల్ అయింది. ముహూర్తం షాట్‌కు రామ్ చరణ్‌ను అతిథిగా పిలిపించి, క్లాప్ కొట్టించడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు.

ప్రస్తుతం కరోనా తాండవం చేస్తోన్న నేపథ్యంలో.. మంచు మనోజ్ ఇంటి పట్టునే ఉంటున్నాడు. ఈ మేరకు తాజాగా తన లుక్‌ను మార్చుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. ఇన్ని రోజులు గడ్డంతో ఉన్న మనోజ్ క్లీన్ షేవ్ చేసుకుని మరింత హ్యాండ్సమ్‌గా మారిపోయాడు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. ఇంట్లో ఉండే సమయంలో మీరు ఎలా ఉంటారో అలానే ఉండండి.. షూటింగ్స్ ఏమీ లేకుండా ప్రస్తుతం ఇంట్లో ఉన్నాను.. కొత్త లుక్ ట్రై చేశాను.. క్లీన్ షేవ్‌తో సంతోషంగా ఉన్నాను.. ఇంట్లో ఉండండి.. సురక్షితంగా ఉండండని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











