twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలంగాణ పోలీసులకు హ్యాట్సాఫ్.. నాగ చైతన్య కామెంట్స్

    |

    కరోనా వైరస్ ధాటికి ప్రపంచం అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ తాకిడికి భారత దేశం సైతం అల్లల్లాడుతోంది. మన దేశంలో కరోనా రోగుల సంఖ్య లెక్కను అదుపులో ఉంచలేకపోతోన్నాం. ఇప్పటికే దాదాపు ఐదు వేలకు పైగా కరోనా బారిన పడ్డారు. ఇందులో వందకుపైగా దుర్మరణం చెందారు. ఇంతలా విజృంభిస్తోన్న కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలను అమలు పరుస్తున్నాయి.

    అందులో భాగంగానే 21 రోజుల పాటు లాక్ డౌన్‌ను విధించారు. ఏప్రిల్ 14 వరకు ఎవ్వరూ కూడా రోడ్ల మీదకు రాకూడదని అందరూ ఇంటికి పరిమితమవ్వాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కొన్ని సడలింపులు కూడా ఇచ్చింది. నిత్యావసర సరకులు తెచ్చుకునేందుక ప్రజలకు అనుమతినిచ్చింది. అయితే శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు నిర్వహిస్తున్న విధులను తెలంగాణ సమాజం కొనియాడుతోంది.

    Corona Effect Naga Chaitanya About Telangana Police

    కరోనా లాంటి కష్టకాలంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యులు, పోలీసులు, పారిశుద్ద్య కార్మికులకు కూడా కేసీఆర్ కూడా సలాం చెప్పాడు. తాజాగా నాగ చైత్యన వీడియో సందేశాన్ని రిలీజ్ చేశాడు. అందులో పోలీసుల సేవలను కొనియాడాడు. ఈ మధ్య తాను కూడా బయటకు వెళ్లానని, మన కోసమే పోలీసులు డ్యూటీ చేస్తున్నారని, బాధ్యతను నిర్వర్తిస్తున్న పోలీసులను చూశానని చెప్పుకొచ్చాడు. వారంతా మనకోసం పని చేస్తున్నారని, అందరూ ఇంట్లోనే ఉండండని, క్షేమంగా ఉండండని సూచించాడు.

    English summary
    Corona Effect Naga Chaitanya About Telangana Police. Naga Chaitanya Suggest The People That Stay At Home Stay Safe.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X