twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కావాలంటే మమ్మీ చున్నీని వాడండి.. వాటిని మాత్రం వదిలేయండి.. రౌడీ స్టార్ సూచనలు

    |

    ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఏ రేంజ్‌లో విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు అమెరికా లాంటి అగ్రరాజ్యమే అతలాకుతలమవుతోంది. అక్కడ లక్షల మందికి కరోనా సోకగా వేల మందిలో ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. మన దేశంలోనూ కరోనా ప్రభావం రోజురోజుకూ ఉధృతంగా మారుతోంది. ఇప్పటికే నాలుగు వేల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. వంద మందకిపైగా ప్రాణాలను వదిలారు. ఇంతలా వ్యాప్తి చెందుతున్న కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు అహర్నిశలు శ్రమిస్తూనే ఉన్నాయి. సెలెబ్రిటీలు సైతం తమ వంతు బాధ్యతగా కరోనాపై అవగాహన కలిగించేందుకు ముందుకు వస్తున్నారు.

    ముందు నుంచి తారల సూచనలు..

    ముందు నుంచి తారల సూచనలు..

    కరోనా వైరస్ మన దేశంలో ప్రవేశించినప్పటి నుంచి సెలెబ్రిటీలంతా సూచిస్తూనే వస్తున్నారు. ఇంట్లోనే ఉండండి, మాస్కులు ధరించండి, చేతులు శుభ్రంగా కడుక్కోండి అంటూ సలహాలు ఇస్తూనే ఉన్నారు. శానిటైజర్ ఉపయోగించడండి, హ్యాండ్ వాష్ ఛాలెంజ్‌లు కూడా విసిరారు.

    వీడియో సందేశాలతో..

    వీడియో సందేశాలతో..

    సినీ తారలంతా వీడియో సందేశాలతో ముందుకు వచ్చి.. ప్రజలకు, అభిమానులకు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతేకాకుండా కరోనా కట్టడికి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తూ.. సీఎం, పీఎంలకు మద్దతుగా నిలుస్తున్నారు.

    కరోనాపై అంతా ఏకమై..

    కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సి జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించేందుకు పాటల రూపంలో మన ముందుకు వచ్చారు. ఈ క్రమంలో కోటి, కీరవాణి, ఆర్జీవి, వందేమాతరం వంటివారు కరోనాపై పాటలను సృష్టించారు. ఇండియన్ స్టార్స్ అంతా కలిసి కరోనాపై పోరాడేందుకు చేయాల్సిన పనులను వివరించనున్నారు.

    Recommended Video

    Balakrishna Donations To CCC and CM Relief Funds, See Chiranjeevi Reaction
    తాజాగా రంగంలోకి రౌడీ స్టార్..

    తాజాగా రంగంలోకి రౌడీ స్టార్..

    అన్నింట్లో ముందుండే విజయ్ దేవరకొండ.. కరోనా విషయంలో కాస్త వెనుకంజ వేశాడు. ఇంత వరకు విరాళం ప్రకటించకపోవడంతో విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాడు. మెడికల్ మాస్క్‌లను డాక్టర్ల కోసం వదిలేయండి.. కావాలంటే హ్యాండ్ కర్ఛీఫ్, స్కార్ఫ్, మమ్మీ చున్నీలను మాస్క్‌లుగా వాడండని సలహా ఇచ్చాడు. ఇంట్లోనే ఉండండి.. ఆరోగ్యంగా ఉండండని తెలిపాడు.

    English summary
    Corona effect Vijay Devarakonda About Mask. My loves, Hope you are all staying safe Cloth face covering will help slow disease spread. Leave the medical masks for doctors and instead Use a handkerchief Use a scarf or Use your mom's Chunni.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X