నాని కెరీర్ లో మరో బిగ్గెస్ట్ మూవీ.. దాని కోసం భారీగా ఖర్చు.. రెమ్యునరేషన్ కంటే ఎక్కువగా?
టాలీవుడ్ నేచురల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ అందుకున్న నాని ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఎదో ఒక కొత్త తరహా పాయింట్ ను హైలెట్ చేస్తూ ఉంటాడు. ఈ మధ్య కాలంలో అయితే అతని సినిమాల బడ్జెట్ కూడా అమాంతంగా పెరిగిపోతోంది. గతంలో ఎప్పుడు లేని విదంగా మార్కెట్ కు మించి సినిమాల ఖర్చు ఎక్కువగానే అవుతోందట. ఇక రాబోయే ఒక సినిమాలో నాని రెమ్యునరేషన్ కంటే ఎక్కువ స్థాయిలో ఖర్చు చేసి సినిమా సెట్ ను నిర్మిస్తున్నారాట. ఆ వివరాల్లోకి వెళితే..

ఓటీటీ డిజాస్టర్స్
నేచురల్ స్టార్ నాని మొత్తానికి శ్యామ్ సింగరాయ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అయితే అందుకున్నాడు. అంతకుముందు వచ్చిన రెండు సినిమాలో కూడా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన V సినిమాతో పాటు శివ నిర్వణ దర్శకత్వంలో చేసిన టక్ జగదీష్ కూడా డిజాస్టర్ టాక్ ను అందుకున్నాయి.

మంచి సక్సెస్
ఇక శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా మళ్లీ ఓటీటీ లోనే విడుదల అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ నాని అలాంటి రిస్క్ తీసుకోకుండా ఆ సినిమాను బిగ్ స్క్రీన్ వద్ద సక్సెస్ అయ్యేలా చేశాడు. సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ఓటీటీ వద్ద కూడా బాగానే క్రేజ్ అందుకుంది. నెట్ ఫ్లిక్స్ లో ఇటీవల అత్యదిక మంది చూసిన సినిమాలో లిస్టులో కూడా నెంబర్ 3లో నిలవడం విశేషం.

మరిన్ని డిఫరెంట్ సినిమాలు
ఇక శ్యామ్ సింగరాయ్ అనంతరం నాని మరిన్ని డిఫరెంట్ సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇటీవల అంటే సుందరానికి అనే సినిమా షూటింగ్ అయితే పూర్తి చేశాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కామెడీ ఫ్యామిలీ డ్రామాగా రానున్న ఆ సినిమాలో నజ్రియా నజిమ్ మేయిన్ హీరోయిన్ గా నటిస్తోంది.

బిగ్ బడ్జెట్ తో దసరా
ఇక ఆ తరువాత నాని కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాల్లో దసరా కూడా నీలవబోతోంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. గోదావరిఖనిలోని సింగరేణి కోల్ ఫీల్డ్స్ నేపథ్యంలో కథ సాగుతుందట.

భారీగా విలేజ్ సెట్..
లేటెస్ట్ టాక్ ప్రకారం.. ఈ సినిమా ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న 12 ఎకరాల స్థలంలో భారీ విలేజ్ సెట్‌ను నిర్మిస్తున్నారట. ఈ సెట్ సింగరేణి ప్రాంతన్ని తలపించేలా ఉంటుందట. దీని కోసం మేకర్స్ దాదాపు రూ.12 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.
గత ఏడాది శ్యామ్ సింగరాయ్ కోసం అవినాష్ గతంలో కోల్‌కతాలో భారీ సెట్‌ను నిర్మించారు. ఇక ఇప్పుడు దసరా సినిమాలో అతని పనికి ప్రశంసలు లభించాయట. ఇక ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











