Court: ఆ సినిమా చూసి డిప్రెషన్‌లోకి శివాజీ.. ఆ డైరెక్టర్‌పై ఫ్రస్టేషన్‌తో బత్రూంలో ఏం చేశాడంటే?
సినీ పరిశ్రమలో ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో అంచనా వేయడం అనేది చెప్పడం ఎవరి తరం కూడా కాదు. ఒక సినిమాతో భారీ ఫేమ్ తెచ్చుకున్న హీరోలు లేదా హీరోయిన్స్ వంటి వారు ఒక్క సినిమా తోనే లైమ్ లైట్ లోకి వచ్చి మళ్ళీ ఎటు వెళ్లిపోయారో కూడా పత్తా లేకుండా పోయినవారు అనేకం. కాగా ఇంకా కొంతమంది పరిస్థితి అయితే మరింత దారుణం అని చెప్పవచ్చు.
పలువురు స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కానీ హీరోలు కానీ కొన్నేళ్ల పాటుగా మంచి వెలుగు వెలిగి తర్వాత తమ ఫేమ్ కోల్పోయి చిన్న చిన్న సినిమాలు చేసే స్టేజికి కూడా వచ్చేస్తారు. మరి ఇలాంటి ప్రముఖ నటుల్లో మన తెలుగు సినిమా సీనియర్ నటుడు శివాజీ కూడా ఒకరు. కాగా శివాజీ హీరోగా అలాగే సహాయ పాత్రలో కూడా చాలా సినిమాలే తాను చేశారు. ఇలా తెలుగు సినిమా దగ్గర కొన్నాళ్లపాటు తన హవా కనబరిచిన శివాజీ ఒక 2014 సమయం వరకు ఓకే అనిపించారు.

అయితే ఏ నటుడికి అయినా కూడా ఒక సరైన బ్రేక్ రావాలని ఎవరైనా కోరుకుంటారు. అయితే సరిగ్గా ఇదే బ్రేక్ తనలోని నెగిటివ్ రోల్ ని కోర్ట్ అనే సినిమాలో చేసి తెలుగు ఆడియెన్స్ కి షాకిచ్చారు. మరి తనకి 25 ఏళ్ళు తర్వాత తన రోజు వచ్చింది అంటూ ఆన్ స్టేజ్ చెప్పారు. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో తాను ఓ ఊహించని అంశాన్ని తన లైఫ్ లో జరిగింది రివీల్ చేశారు.
శివాజీ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఇండస్ట్రీ హిట్ ఖుషి సినిమా చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఎస్ జె సూర్య నటన ఓ సినిమాలో చూసి డిప్రెషన్ కి లోనయినట్టుగా తెలిపారు. అవ్వడానికి ఎస్ జె సూర్య దర్శకుడు అయినప్పటికీ తాను మాత్రం నటుడు అవ్వాలనే వచ్చాను అని ఎన్నోసార్లు తెలిపారు.
ఇపుడు అనుకున్నట్టు గానే సాలిడ్ పాత్రలు తనకి వస్తున్నాయి. కాగా ఇలా తెలుగులో తాను చేసిన సినిమా "సరిపోదా శనివారం" లో పోలీస్ పాత్రకి ఎంతో గుర్తింపు వచ్చింది. మరి ఈ రోల్ ని శివాజీ చూసి తనకెందుకు ఇలాంటి పాత్రలు రావడం లేదని చాలా బాధ పడి కోపంలో తన ఇంటి బాత్రూంలో అద్దాన్ని గుద్దితే పగిలిపోయింది అట. ఇలా ఒక నటుడుగా శివాజీ ఎంత డిప్రెషన్ కి తాను లోనయ్యారో అనేది అర్ధం చేసుకోవచ్చు. కానీ ఎట్టకేలకి కోర్ట్ సినిమాతో మాత్రం గట్టి బ్రేక్ ని తాను అందుకున్నారు.


Click it and Unblock the Notifications











