త్రివిక్రమ్ నుంచి బొమ్మరిల్లు భాస్కర్ వరకు అంతా అతడి కోసమే!
విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ఎన్నడూ లేనంత బిజీగా మారిపోతున్నాడు. ఇప్పటికే పలు పలు మల్టీస్టారర్ చిత్రాలతో బిజీగా ఉన్న వెంకటేష్ నుంచి వచ్చే ఏడాది మరిన్ని అద్భుత చిత్రాలు రాబోతున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ కోసం ఎదురుచూస్తున్న దర్శకుల జాబితా పరిశీలిస్తే ఆశ్చర్యపోవలసిందే.
పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!
ప్రస్తుతం వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శత్వంలో మల్టీస్టారర్ చిత్రం ఎఫ్2 లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ మరో హీరో. చాలా రోజుల క్రితం జైలవకుశ డైరెక్టర్ బాబీ దర్శత్వంలో వెంకటేష్ మరో చిత్రాన్ని ప్రారంభించాడు. ఇది కూడా మల్టీస్టారర్ చిత్రమే. ఈ చిత్రంలో వెంకీ, నాగ చైతన్య కలసి నటించబోతున్నారు. వెంకీ మామ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

అరవింద సమేత చిత్రం తరువాత త్రివిక్రమ్ దర్శత్వంలో వెంకటేష్ చిత్రం ఉండబోతోందనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతూనే ఉంది. తాజగా వెంకీ తదుపరి చిత్రాల గురించి క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. యువ దర్శకుడు వెంకీ అట్లూరి వెంకటేష్ కోసం అద్భుతమైన కథ సిద్ధం చేశాడట. ఈ చిత్రానికి కూడా వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా బొమ్మరిల్లు ఫేమ్ బొమ్మరిల్లు భాస్కర్ ఇటీవల వెంకటేష్ కు ఓ లైన్ వినిపించాడట. పూర్తి కథ సిద్ధం చేయమని వెంకటేష్ భాస్కర్ ని ఆదేశించినట్లు ఇండస్ట్రీవర్గాల్లో బలమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఓకే అయితే వెంకీ ఊపిరి సలపనంత బిజీగా మారిపోవడం ఖాయం.


Click it and Unblock the Notifications











