For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నెటిజన్ ఫిర్యాదు.. అల్లు అర్జున్‌కు షాకిచ్చిన పోలీసులు.. తారక్‌ కూడా దొరికిపోయాడు

  |
  Hyderabad Traffic Police Fined Allu Arjun! || Filmibeat Telugu

  ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటర్నెట్‌ను చాలా మంది చెడు కార్యాలకు ఉపయోగిస్తుంటే.. కొంత మంది మాత్రం మంచి పనులకు వాడుకుంటున్నారు. చీమ చిటుక్కుమన్నా సోషల్ మీడియాను ఉపయోగించి సంబంధిత విభాగానికి ఫిర్యాదు చేసేస్తున్నారు. ఇక, హైదరాబాద్ నగర పరిధిలో ఇలాంటివి తరచూ జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ట్రాఫిక్ విషయంలో నెటిజన్లు కొంత ఎక్కువగానే యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇప్పుడిదే టాలీవుడ్ స్టైలిష్ స్టార్‌కు జరిమానా పడేలా చేసింది.

  అల్లు అర్జున్‌కు జరిమానా

  అల్లు అర్జున్‌కు జరిమానా

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. అతడు ప్రయాణిస్తున్న క్యారీ వ్యాన్‌ (టీఎస్09ఎఫ్‌జీ 0666)కు బ్లాక్ ఫిల్మ్స్ ఉండడాన్ని గమనించిన ఓ వ్యక్తి దాన్ని ఫొటో తీసి, ట్విటర్‌లో సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు అల్లు అర్జున్‌కు రూ. 735లు జరిమానా విధించారు. ఈ ఘటన జూలై 16 న సాయంత్రం 4:25కు హిమాయత్‌సాగర్‌ ప్రాంతంలో జరిగింది. అయితే, ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

  ఈ మధ్యే ఆర్జీవీ బుక్కయ్యాడు

  ఈ మధ్యే ఆర్జీవీ బుక్కయ్యాడు

  ఇటీవల సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ చేస్తూ హైదరాబాద్‌లోని రోడ్లపై చక్కర్లు కొట్టాడు. ఆ వీడియోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పెట్టడంతోపాటు పోలీసులు ఎక్కడ అంటూ ప్రశ్నించాడు. దీనిపై వెంటనే స్పందించిన ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్‌ లేకపోవడం, ట్రిపుల్‌ రైడింగ్‌కు రూ.1300 జరిమానా విధించిన విషయం తెలిసిందే.

  అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్‌కు..

  అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్‌కు..

  సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ కారుకు జరిమానా విధించారు. ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న రేంజ్ రోవర్‌ (ఏపీ 37 ఏఎక్స్ 9999)కు నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్‌ఫిల్మ్‌ను వినియోగించినందుకు ట్రాఫిక్ పోలీసులు రూ.700ల జరిమానా విధించారు. అమీర్‌పేట్‌లోని సారథి స్టూడియో చౌరస్తాలో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఇది అప్పట్లో హాట్ టాపిక్ అయింది.

  నిబంధనలు పాటించడం లేదని సెటైర్లు

  నిబంధనలు పాటించడం లేదని సెటైర్లు

  సమాజానికి సందేశాలు ఇవ్వాల్సిన హీరోలే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం దారుణమని పలువురు కామెంట్లు చేస్తున్నారు. సెలెబ్రిటీలుగా వెలుగొందుతున్న వారంతా రూల్స్ పాటించకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. దీనిని ఉద్దేశ్యిస్తూ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు కూడా వేస్తున్నారు.

  అల్లు అర్జున్ సినిమా

  అల్లు అర్జున్ సినిమా

  ప్రస్తుతం అల్లు అర్జున్.. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేస్తున్నాడు. గతంలో వీళ్లిద్దరి కలయికలో గతంలో ‘జులాయి', ‘సన్నాఫ్ సత్యమూర్తి' వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఈ రెండింటి తర్వాత వీళ్ల కాంబినేషన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

  English summary
  Allu Arjun took his time to sign his next film. The actor seems to have gone on a break to make his decision about his future projects. Now, he is back on track with a film with ace director Trivikram Srinivas. Now Cyberabad Police Gave Shock To Allu Arjun.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X