Nandamuri Balakrishna : 130 కోట్ల కలెక్షన్స్‌తో సంచలనం .. బాలయ్య సినిమాకు ఇరాక్ ఫిదా!
టాలీవుడ్ టాప్ హీరోలలో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. వరుసగా నాలుగు సినిమాల హిట్లు, ఎమ్మెల్యేగా హ్యాట్రిక్, పద్మభూషణ్ అవార్డు, హోస్ట్‌గా సక్సెస్.. ఇలా బాలకృష్ణ ఏది పట్టుకున్నా బంగారంగా మారుతోంది. బాబీ కొల్లి దర్శకత్వంలో బాలయ్య నటించిన డాకు మహారాజ్ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించి .. బాలకృష్ణకు వరుసగా నాలుగో హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో డాకు మహారాజ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఈ వివరాల్లోకి వెళితే..
సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు రూ.భారీ బడ్జెట్‌తో డాకు మహారాజ్‌ను నిర్మించారు. ఇందులో నందమూరి బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రద్ధా శ్రీనాథ్ , చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్‌లు కీలక పాత్రలు పోషించారు. థమన్ స్వరాలు సమకూర్చారు. టీజర్ , ట్రైలర్లు, ఫస్ట్ లుక్ పోస్టర్‌లతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా .. బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది డాకు మహారాజ్.

నైజాంలో రూ. 17.50 కోట్లు, రాయలసీమలో రూ.15.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8 కోట్లు, తూర్పుగోదావరిలో రూ.6 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.5 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ. 5.4 కోట్లు, గుంటూరులో రూ. 7.2 కోట్లు, నెల్లూరులో రూ.2.7 కోట్లు మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 67.30 కోట్ల వ్యాపారం చేశాడు బాలయ్య. అలాగే ఓవర్సీస్‌లో రూ.8 కోట్లు, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి రూ.5.40 కోట్లు చొప్పున మొత్తంగా రూ.80.70 కోట్లు బిజినెస్ చేసింది.
సంక్రాంతి కానుకగా జనవరి 12, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది డాకు మహారాజ్. థియేట్రికల్ రన్ ముగిసేసరికి బాలయ్య చిత్రం భారత్‌లో రూ.91.23 కోట్ల నెట్, రూ.108.01 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్‌లో వచ్చిన 18.1 కోట్ల రూపాయలు కలిపి మొత్తంగా రూ.126.11 కోట్ల కలెక్షన్స్ సాధించినట్లు సాక్‌నిల్క్ వెబ్‌సైట్ తెలిపింది. తద్వారా 2025లో అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడో తెలుగు చిత్రంగా డాకు మహారాజ్‌గా నిలిచింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ కాలేకపోయినప్పటికీ.. ఓటీటీ రైట్స్, ఆడియో, శాటిలైట్ రైట్స్‌తో కలిపి నిర్మాత సేఫ్ జోన్‌లోకి వచ్చినట్లేనని ట్రేడ్ పండితుల అంచనా.
కాగా.. ఈ నేపథ్యంలో డాకు మహారాజ్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. బాలకృష్ణ నట విశ్వరూపానికి తెలుగు ప్రేక్షకులతో పాటు ఎప్పుడూ ఉద్రిక్తంగా ఉండే ఇరాక్ సైతం ఫిదా అయ్యింది. ఆ దేశానికి చెందిన ప్రముఖ వార్తాపత్రిక .. డాకు మహారాజ్ సినిమా , అందులో హీరో పాత్ర గురించి ప్రస్తావిస్తూ కథనాన్ని ప్రచురించింది. హీరోను పవర్‌ఫుల్‌గా చూపించారని, టెక్నికల్ వాల్యూస్, యాక్షన్ సీక్వెన్స్‌లు బాగున్నాయని ఆ కథనంలో పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పేపర్ కటింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య అభిమానులు దీనిని షేర్ చేస్తున్నారు. ఒక తెలుగు సినిమా గురించి ఎక్కడో ఇరాక్ దేశంలోని పేపర్‌లో రావడం అరుదని వారు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











