బాలీవుడ్‌లో మరో ఘనత సాధించిన విజయ్ దేవరకొండ.. ఆ క్యాలెండర్‌లో తొలి సౌత్ హీరోగా..

నేటితరం యంగ్ జనరేషన్ ఎంతో స్పూర్తిని ఇచ్చే విధంగా మాట్లాడే అతి తక్కువమంది హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. సినిమాల సంగతి పక్కన పెడితే తన మాటలతోనే యువతను ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తుంటాడు. రౌడి స్టార్ బ్రాండ్ జనాల్లోకి వెళ్ళడానికి అతని స్టైల్ తో పాటు మంచి తనం కూడా మరో కారణం. ఇక సౌత్ ఇండస్ట్రీలో ఎవరు సాదించని ఘనతను కూడా బాలీవుడ్ లో అందుకున్నాడు. ఒక ప్రముఖ క్యాలెండర్ కవర్ పేజ్ పై విజయ్ ఫొటో ఉండడం హాట్ టాపిక్ గా మారింది.

సైడ్ క్యారెక్టర్లు చేసుకుంటూ

సైడ్ క్యారెక్టర్లు చేసుకుంటూ

అప్పుడెప్పుడో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించిన విజయ్ ఎంతో ఓపికతో హీరోగా అవ్వడానికి ప్రయత్నాలు చేశాడు. ఒక్క శుక్రవారంతో అతని లైఫ్ మారలేదు. సైడ్ క్యారెక్టర్లు చేసుకుంటూ వచ్చి ఇప్పుడొక పాన్ ఇండియా స్టార్ వరకు వచ్చాడు. నిజంగా నేటితరం జనరేషన్ కు అతను ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచాడు.

 బ్యాక్ గ్రౌండ్ లేకుండా సక్సెస్

బ్యాక్ గ్రౌండ్ లేకుండా సక్సెస్

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సక్సెస్ అయిన విజయ్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారుతున్నాడు. లైగర్ సినిమా ఇంకా విడుదలవ్వక ముందే హిందీ జనాలకు మెల్లగా దగ్గరవుతున్నాడు. ఇక ఇప్పటివరకు ఏ సౌత్ యాక్టర్ కు దక్కని ఒక ఘనత కూడా విజయ్ అందుకోవడం విశేషం.

డబూ రత్నాని క్యాలెండర్‌లో..

డబూ రత్నాని క్యాలెండర్‌లో..

ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ డబూ రత్నాని క్యాలెండర్‌లో ఒక్కో ఫొటో పడినా చాలని బాలీవుడ్ తారాలు ఎంతగానో పోటీ పడుతుంటారు. ముంబైలో డబూ రత్నాని ఫోటోగ్రఫీకి హై డిమాండ్ ఉంటుంది. ఇక అలాంటి ఫొటోగ్రాఫర్ క్యాలెండర్ లో విజయ్ స్టిల్స్ కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. చూస్తుంటే విజయ్ బాలీవుడ్ లో ఈజీగా క్లిక్కయ్యేలా ఉన్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Yash, Puri Jagannadh To Team Up For A Political Thriller || Filmibeat Telugu
లైగర్ తో పవర్ఫుల్ గా..

లైగర్ తో పవర్ఫుల్ గా..


ఇప్పటివరకు విజయ్ చేసింది కొన్ని సినిమాలే అయినా జెట్ స్పీడ్ తో బాలీవుడ్ లో క్రేజ్ అందుకుంటున్నాడు. ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమా షూటింగ్ తుది దశలో ఉన్న విషయం తెలిసిందే. ఆ సినిమాతో ఎలాగైనా పాన్ ఇండియా మార్కెట్ సెట్ చేసుకోవాలని విజయ్ చాలా బలంగా రెడీ అవుతున్నాడు. మరి ఆ సినిమా నేషనల్ వైడ్ గా ఎలాంటి వసూళ్లను అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X