వార్డు మెంబర్‌గా రానా.. ఆసక్తికరంగా విరాటపర్వం 1992!
విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ రానా దూసుకుపోతున్నాడు. బాహుబలి, ఘాజి, నేనే రాజు నేనే మంత్రి లాంటి చిత్రాలలో నటిస్తూ అభిమానులకు ఎప్పటికి గుర్తుండిపోయే పాత్రలు అందిస్తున్నాడు.గత కొంతకాలంగా రానా వేణు ఊడుగుల దర్శకత్వంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి విరాటపర్వం 1992 అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నారు. ఆ మధ్యం ఈ చిత్రం ఆగిపోయిందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో రానా స్పందించాడు.
ఈ చిత్రం ఆగిపోలేదని నేను, సాయిపల్లవి జంటగా నటించబోతున్నాం అని రాజా క్లారిటీ ఇచ్చాడు. నీదీ నాది ఒకే కథ చిత్రంలో వేణు ఊడుగుల మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. విరాటపర్వం చిత్రంలో రానా పాత్ర గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో రానా పంచాయతీ వార్డు మెంబర్‌గా నటిస్తాడట. వేణు ఈ చిత్ర కథని చాలా ఆసక్తికరంగా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

రాజా ఇప్పటికే నేనేరాజు నేనే మంత్రి చిత్రంలో రాజకీయనాయకుడిగా నటించాడు. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభం కానుంది అనే విషయం త్వరలోనే తెలియనుంది. రానా కోసం దర్శకుడు వేణు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాడు.


Click it and Unblock the Notifications











