మీ ఆ పార్ట్ సూపర్.. సీక్రెట్ ఏంటో చెప్పు.. నెటిజన్ ప్రశ్నకు దక్ష దిమ్మతిరిగేలా జవాబు.. అదేంటో తెలుసా?
సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో సెలబ్రీటలకు తమ అభిమానులను చేరుకోవడం, వారితో ముచ్చటించడం చాలా ఈజీ అయిపోయింది. ట్విట్టర్, ఇన్స్‌టాగ్రామ్‌లో#AskMe అంటూ అభిమానులతో ముచ్చటిస్తూ తమ గురించి తెలుసుకొంటారు. కొన్నిసార్లు ఫ్యాన్స్ సినీ తారలకు మంచి అనుభవాన్ని పంచితే.. పలుమార్లు తిక్క తిక్క ప్రశ్నలతో చేదు అనుభవాన్ని మిగిల్చుతుంటారు.
తాజాగా యువ హీరోయిన్ దక్షా నగార్కర్‌ను అడగకూడని ప్రశ్న అడిగి ఆన్‌లైన్‌లో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే.. ఆమె ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఆమెను అడిగిన ప్రశ్న ఏమిటి? హీరోయిన్ ఇచ్చిన సమాధానం ఏమిటి అనే వివరాల్లోకి వెళితే..

తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ గుర్తింపు పొందిన యువ హీరోయిన్లలో దక్షా నగార్కర్ ఒకరంటే ఎలాంటి సందేహం లేదు. ఏకే రావు పీకే రావు అనే సినిమాలో స్రవంతి పాత్రతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత హోరా హోరీ సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకొన్నది. అయితే ఈ రెండు సినిమాలు కూడా అంతగా గుర్తింపు తీసుకు రాలేదు.
అయితే హుషారు సినిమాతో దక్షా నగార్కర్‌కు మంచి గుర్తింపు లభించింది. దాంతో జాంబిరెడ్డి, బంగార్రాజు లాంటి చిత్రాల్లో యువ హీరోలతో జత కట్టే అవకాశం చేజిక్కించుకొని నటించింది. ఇటీవల వచ్చిన రవితేజ సినిమా రావణసుర చిత్రంలో కూడా కీలక పాత్రల్లో కనిపించింది.
అయితే ఇటీవల ఇన్స్‌టాగ్రామ్‌లో తన అభిమానులతో ముచ్చటించేందుకు ఓ ఆన్‌లైన్ ఛాటింగ్ చేసింది. ఈ సందర్భంగా అభిమానులు తమకు తోచిన ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఎలాంటి ఇబ్బంది పడకుండా జవాబు చెప్పింది. అయితే ఈ ఇన్స్‌టాగ్రామ్ ఛాటింగ్‌లో మీ తొడలు బాగుంటాయి. అవి అందంగా ఉండటం వెనుక సీక్రెట్ ఏమిటని తుంటరి ప్రశ్న వేశాడు.

నెటిజన్ అడిగిన ప్రశ్నకు దక్షా నగార్కర్ ఎలాంటి కంగారు పడకుండా వెంటనే సమయస్పూర్తిగా స్పందించారు. ఏ మాత్రం ఇబ్బంది పడకుండా దిమ్మతిరిగే జవాబు ఇచ్చింది. తన తొడలు గురించిన ప్రశ్నకు.. జవాబిస్తూ.. నేను రోజు మసాలా వడలు తింటాను. అందుకే నా తొడలు బాగుంటాయి అని దక్ష నాగార్కర్ బుర్ర తిరిగేలా జవాబిచ్చి నవ్వుతూ ఉండిపోయింది.


Click it and Unblock the Notifications











