ఒక్క నంద్యాల పర్యటన .. అల్లు అర్జున్ ప్రతిష్టకు డ్యామేజ్ జరుగుతోందా..?

అల్లు అర్జున్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. దిగ్గజ హాస్య నటుడు అల్లు రామలింగయ్య మనవడిగా, స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కుమారుడిగా, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నారు . ఘనమైన కుటుంబ నేపథ్యం లాంచింగ్ వరకే ఉపయోగపడుతుందని.. ఇండస్ట్రీలో నిలబడాలంటే తనను తాను నిరూపించుకోవాలని బన్నీ కెరీర్ తొలినాళ్లలోనే గ్రహించాడు. గంగోత్రి మొత్తం పెద్దల పర్యవేక్షణలోనే నడిచింది. మెగా బ్రాండ్ ఇమేజ్, అల్లు అరవింద్, అశ్వినీదత్, కే. రాఘవేంద్రరావు తదితరుల ప్లానింగ్ కారణంగా గంగోత్రిని చూసేందుకు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగింది.

కానీ ప్రతీసారి పెద్దలు వెనుక ఉండలేరు కదా. అందుకే తన మార్క్ చూపించాలని బన్నీ నిర్ణయించుకున్నారు. దీనికి తోడు యాక్టింగ్, లుక్ పరంగా విమర్శలకు, ట్రోలింగ్‌కు గురైనా నిరుత్సాహపడలేదు. దీక్షతో మేకోవర్ అయ్యాడు.. ఆర్యతో అల్లు అర్జున్‌లో ఉన్న టాలెంట్ బయటపడింది. ఆర్య బ్లాక్ బస్టర్ కావడంతో వైవిధ్యమైన కథలకు ఆయన పెద్దపీట వేశారు. బన్నీ, హ్యాపీ, దేశముదురు, జులాయి, రేసుగుర్రం, డీజే, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు, నా పేరు సూర్య, అల వైకుంఠపురంలో ఇలా ప్రతి సినిమా ప్రత్యేకంగా ఉండేలా చూసుకుని లవర్ బాయ్‌గా, స్టైలీష్‌స్టార్‌ ఎదిగిన అల్లు అర్జున్‌ను మరో మెట్టెక్కించిన సినిమా పుష్ప. ఈ మూవీలోని డీగ్లామర్ రోల్‌లో ఎర్రచందనం స్మగ్లర్‌గా బన్నీ నటన, డైలాగులు, డ్యాన్స్‌లకు యావత్ భారతదేశం ఊగిపోయింది. పుష్పతో ఆయన ఐకాన్‌స్టార్‌గా మారిపోయారు. ఈ సినిమాలో నటనకు గాను ఉత్తమ జాతీయ నటుడిగా ఎంపికైన బన్నీ.. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించారు.

damage to allu arjuns reputation Due to his nandyal tour

మెగాస్టార్ చిరంజీవి తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో బెస్ట్ డ్యాన్సర్ అంటే ఠక్కున వినిపించే పేరు అల్లు అర్జున్. మంచి నటుడిగా ఉంటూనే ప్రొఫెషనల్ డ్యాన్సర్ అని అనిపించుకోవడం తనకు ఎంతో ఇష్టమని బన్నీ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. సినిమాలు, షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నా.. కుటుంబానికి అంతే ప్రాధాన్యతనిస్తారు అల్లు అర్జున్. మంచి భర్త, మంచి తండ్రి, మంచి కొడుకుగా ఎంతో ఎత్తుకు ఎదిగి తెలుగుతో పాటు మలయాళంలోనూ ఫ్యాన్స్‌ను సంపాదించుకుని ''మల్లు అర్జున్‌‌''గా పిలుపించుకుంటున్నారు .

అలా ఎంతో ఎత్తుకు ఎదిగినప్పటికీ కొన్ని వివాదాల కారణంగా బన్నీ ప్రతిష్టకు డ్యామేజ్ జరుగుతోంది. సూటిగా సుత్తి లేకుండా చెప్పే తత్వం కారణంగా విమర్శల పాలయ్యారు అల్లు అర్జున్. మెగా ఫ్యామిలీతో అల్లు ఫ్యామిలీ గతంలో మాదిరిగా కలివిడిగా ఉండటం లేదని.. దీనికి బన్నీ వైఖరే కారణమని సోషల్ మీడియాలో ఏనాటి నుంచో డిస్కషన్ నడుస్తోంది. ముఖ్యంగా 'చెప్పను బ్రదర్ ' ఇష్యూ నుంచి కుటుంబంలో చీలిక వచ్చిందని ఫిలింనగర్ సర్కిల్స్‌లో చెప్పుకుంటూ ఉంటారు. తర్వాత రెండు కుటుంబాలు శుభకార్యాల్లో కలిసినా మునుపటిలా బాండింగ్ ఉందా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇలాంటి వేళ ఈ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మెగా ఫ్యామిలీలో అల్లు ఫ్యామిలీ వేరనే సంకేతాలను మరోసారి బలంగా పంపింది.

damage to allu arjuns reputation Due to his nandyal tour

ఎన్నికల ప్రచార గడువు కొద్దిగంటల్లో ముగుస్తుందనగా తన క్లోజ్ ఫ్రెండ్ , వైసీపీ నేత శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్ధతు పలికేందుకు బన్నీ తన భార్యతో కలిసి నంద్యాలలో దిగారు. శిల్పా రవిని గెలిపించాలని తన అభిమానులను కోరారు. ఇది తెలుగు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. సొంత మేనమామ పవన్ కళ్యాణ్ ‌పిఠాపురంలో కష్టపడుతుంటే ఓ చిన్న ట్వీట్‌తో సరిపెట్టి.. ఫ్రెండ్ వద్దకు స్వయంగా వెళ్లడాన్ని మెగా, జనసేన అభిమానులు తప్పుబడుతున్నారు. అయితే నా అన్నవాళ్లు ఏ పార్టీలో ఉన్నా సపోర్ట్ చేస్తానని అల్లు అర్జున్ స్పష్టం చేశారు. కానీ ఆయనపై మెగా కాంపౌండ్ గుర్రుగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది.

ఇక సోషల్ మీడియాలో బన్నీపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. మెగా ఫ్యామిలీ వల్ల హీరోగా స్టార్‌డం సంపాదించి ఇప్పుడు ఆ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేయడం ఏంటంటూ మెగాభిమానులు మండిపడుతున్నారు. దీనికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ధీటుగానే బదులిస్తున్నారు. మెగా హీరోలందరిలోకి స్టైలీష్‌గా ఉండటం వల్లే బన్నీ ఐకాన్‌స్టార్‌గా ఎదిగాడంటూ వారు కామెంట్స్ పెడుతున్నారు. ఈ పరిణామాలు ప్రజల్లోనూ, అభిమానుల్లోనూ బన్నీపై ఒక రకమైన అభిప్రాయానికి కారణమై ఆయన ప్రతిష్టనే దెబ్బతీయడంతో పాటు సినిమాలపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X