శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ వెనక్కు.. యువ దర్శకుడితో ధనుష్ మూవీ.. న్యూ టైటిల్ రెడీ!
కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా మోస్ట్ టాలెంటెడ్ నటుడిగా గుర్తింపు అందుకున్న వారిలో ధనుష్ కూడా ఉంటాడు అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈ టాలెంటెడ్ నటుడు ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ లో తన మార్కెట్ ను పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకోసం విభిన్నమైన తరహాలో అడుగులు వేస్తున్నాడు. ఒకేసారి అగ్ర దర్శకులతో సినిమాలు చేయకుండా మీడియం రేంజ్ టాలెంటెడ్ దర్శకులతో సినిమాలు చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇదివరకే శేఖర్ కమ్ములతో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు సమాచారం.
గతంలో శేఖర్ కమ్ముల లీడర్ సినిమాతో ఏ విధంహా మెప్పించాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా కూడా అదే తరహాలో ఉంటుందట. అయితే ఈ సినిమా ఈ ఏడాది చివర్లో స్టార్ట్ అవుతుందని చెప్పారు. కానీ ఆ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక సౌత్ ఇండస్ట్రీలో అన్ని భాషల్లో కూడా ఆ సినిమా విడుదల అవుతుందని చెప్పారు. ఆ సినిమా విషయంలో దర్శకుడు శేఖర్ కమ్ముల చాలా నెమ్మదిగా అడుగులు వేస్తూ ఉన్నాడు. ఇక అంతకంటే ముందే ధనుష్ తెలుగు దర్శకుడితో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దర్శకుడు మరెవరో కాదు తొలిప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమాలతో ఇటీవల ఎంతగానో ఆకట్టుకున్న వెంకీ అట్లూరి.

ఈ దర్శకుడు త్వరలోనే ద్విభాషా చిత్రాన్ని చేయాలని ప్రణాళికలు రచించాడు. అందుకోసం ధనుష్ కథను వివరించగా అతను సింగిల్ సిట్టింగ్ లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఒక విధంగా ఈ దర్శకుడు శేఖర్ కమ్ముల కంటే వేగంగా తన ప్రాజెక్టును తెరపైకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. నేడు సినిమాకు సంబంధించిన ముఖ్యమైన అప్ డేట్ ఇచ్చారు. గురువారం రోజు సినిమా టైటిల్ కూడా విడుదల చేయబోతున్నారట. ఉదయం 9 గంటల 36 నిమిషాలకు టైటిల్ పోస్టర్ ను విడుదల చేయబోతున్నట్లు క్లారిటీ కూడా ఇచ్చేశాడు. ఇక సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు అన్నీ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. త్వరలోనే రెగ్యులర్ సినిమా షూటింగ్ ను కూడా మొదలు పెట్టబోతున్నారు. సినిమా నాగ వంశీ సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.
ధనుష్ కేవలం ఈ సినిమాలలోనే కాకుండా హాలీవుడ్లో కూడా నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లీష్ లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే తన సోదరుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. ఆ ప్రాజెక్టు యుగానికి ఒక్కడు సినిమాకు సీక్వెల్ గా రానుంది. ఇక ఆ సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరపైకి తీసుకురావాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











