Danush: సార్ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రెడీ.. బిగ్ సర్‌ప్రైజ్‌ ప్లాన్ చేసిన ధనుష్!

టాలెంటెడ్ హీరో ధనుష్ ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో ఏదో ఒక సరికొత్త పాయింట్ హైలెట్ అవుతూ ఉంటుంది అని అందరికీ తెలిసిన విషయమే. ప్రేక్షకుల్లో ఈ నటుడు సెలెక్ట్ చేసుకునే ప్రతి కథకు కూడా ఎంతో కొంత నమ్మకం అయితే ఉంటుంది. ధనుష్ ఇక రాబోయే రోజుల్లో మరిన్ని విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతున్నట్లుగా అర్థమవుతుంది. ఇటీవల హాలీవుడ్ టెక్నీషియన్స్ తో కూడా అతను ప్రాజెక్టులు చేస్తున్న విషయం తెలిసిందే.

ద గ్రే మ్యాన్ సినిమాతో కూడా హాలీవుడ్ లో కూడా మంచి ప్రయోజనం అందుకున్నాడు. ఇక ధనుష్ నటించిన మరో సినిమా వరుస ప్రమోషన్లతో హడావిడి చేసేందుకు మొదలయ్యింది. సితార ఎంటర్టైన్మెంట్స్ లో యువ నిర్మాత నాగవంశి నిర్మిస్తున్న 'సార్' సినిమా షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకుంటుంది. తొలిప్రేమ, మిస్టర్ మజ్ను చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ సినిమా తమిళ్ తెలుగులో ఒకేసారి విడుదల కాబోతోంది.

Danush sir movie first look poster and teaser release date fix

ఈ సినిమాపై ధనుష్ చాలా నమ్మకం పెట్టుకున్నాడు ఎందుకంటే. మొదటిసారి డైరెక్ట్ గా తెలుగులో కూడా సినిమాను చేస్తూ ఉండడంతో ఈ సినిమా అతనే కెరీర్ కు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. అయితే సార్ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వడానికి చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఈనెల 27వ తేదీన ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారు. ఇక 28వ తేదీన సినిమా మొదటి టీజర్ ను విడుదల చేయనున్నట్లు అఫీషియల్ గా పోస్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ సినిమాలో ధనుష్ ఒక ఉపాధ్యాయుడిగా కనిపించబోతున్నాడు. ఇక సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు దాదాపు ఆఖరి దశకు చేరుకున్నాయి. ఇక త్వరలోనే మరిన్ని టీజర్స్ అలాగే సాంగ్స్ కూడా విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X