Dasara టాప్ లేపుతుంది.. మహానటిని మించి కీర్తీ సురేష్ ఫెర్ఫార్మెన్స్.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాని
నేచురల్ స్టార్ నాని, మహానటి ఫేమ్ కీర్తి సురేష్ నటించిన దసరా చిత్రం మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషన్‌లో భాగంగా అనంతపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ..

సినిమా రంగంలో ఓ భాష ఉంటుంది. తెలుగు సినిమా పరిశ్రమలో సీడెడ్ అంటే మాస్ అంటారు. దసరా సినిమాలో మాస్ అంశాలు మిమ్మల్ని రంజింప చేస్తున్నది. దసరా సినిమా కోసం చాలా కష్టపడ్డాం. సంవత్సరం పాటు దుమ్ము, ధూళీలో పనిచేశాం. ఇది నా మనసుకు దగ్గరైన సినిమా. ఈ సినిమాను అందించిన నిర్మాత సుధాకర్ గారికీ.. థ్యాంక్స్. దసరా సినిమా అందరికి కెరీర్ పరంగా మంచి అవకాశాలు కలిపిస్తుంది. ఈ సినిమాలో స్నేహితులతో నటించడం చాలా హ్యాపీగా ఉంది. 80 ఏళ్ల తర్వాత కూడా స్నేహితులను గుర్తించుకొనేలా స్నేహం ఉంటుంది.
దసరా సినిమాలో కాసర్ల శ్యామ్ రాసిన ప్రతీ పాట, ప్రతీ లైన్ సెన్సేషనల్ అవుతున్నది. నిర్మాతలందరూ కాసర్ల శ్యామ్ కావాలని కోరుకొంటారు. సతీష్ మాస్టర్ చేసిన ఫైట్స్ అదిరిపోయేలా ఉన్నాయి. మ్యూజిక్ సంతోష్ నారాయణ్.. దర్శకుడు శ్రీకాంత్ ఇంకా సినిమాను చెక్కుతున్నారు. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కోళ్లకు థ్యాంక్స్. 22 ఎకరాల్లో అద్బుతమైన సెట్ వేశారు. నవీన్ నూలి ఈ సినిమాకు మంచి ఎడిట్ ఇవ్వడమే కాకుండా ప్రతీ ఒక్కరికి ఈ సినిమా హిట్ చెబుతున్నారు. అందుకు థ్యాంక్స్ అని అన్నారు.

మా డైరెక్షన్ టీమ్‌లో 12 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు. అందరూ త్వరలోనే డైరెక్టర్లు అవుతారు. ఎవరైనా సినిమా తీయాలంటే.. ముందే వారికి అడ్వాన్స్ ఇచ్చుకోవచ్చని చెబుతాను. డైరెక్షన్ టీమ్ అందరికి నా శుభాకాంక్షలు. ఈవెంట్‌కు సహకరించిన పోలీసులు, కళాశాల యాజమాన్యానికి ధన్యవాదాలు అని నాని అన్నారు.
వెన్నెల పాత్రలో చేసిన కీర్తీ సురేష్‌కు ముందు థ్యాంక్స్ చెప్పాలి. కీర్తీ నేను.. నేను లోకల్ తర్వాత మెమొరబుల్ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాం. దసరా లాంటి సినిమా కంటే మరో మెమొరబల్ మూవీ ఏముంటుంది. మహానటికి మించిన ఫెర్ఫార్మెన్స్ చేసింది. మార్చి 30 తర్వాత మీరే చెబుతారు అని నాని చెప్పారు.
దసరాలో దీక్షిత్ శెట్టి నటన సూపర్‌గా ఉంది. ఈ సినిమాలో ఆయన ఫెర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెర మీద మీరే చూస్తారు. ఈ సినిమా టాప్ లేపే సినిమా అవుతుంది అని నాని చెప్పారు.


Click it and Unblock the Notifications











