twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vijay Deverakonda రికార్డ్ క్రియేట్ చేసిన రౌడీ స్టార్.. అక్కడ డియర్ కామ్రేడ్ బ్లాక్‌బస్టర్!

    |

    టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం తెలుగు కుర్రకారులో సగం మంది ఆయన ఫ్యాన్సే అనడంలో ఏమాత్రం సందేశం లేదు. వారంతా ముద్దుగా రౌడీ స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉండే ఆయన నటించిన ఒక సినిమా తెలుగులో యావరేజ్ టాక్ తెచ్చుకుంది కానీ హిందీలో మాత్రం ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు తెలుగు నుంచి హిందీ డబ్ అయిన సినిమాల్లో అదో రికార్డు సృష్టించింది. ఆ వివరాల్లోకి వెళితే

    పాన్ ఇండియా స్థాయిలో

    పాన్ ఇండియా స్థాయిలో

    పెళ్లి చూపులు సినిమాతో సోలో హీరోగా మారి, 'అర్జున్ రెడ్డి'లో అగ్రెసివ్ క్యారెక్టర్ తో రెచ్చిపోయిన విజయ్, 'గీత గోవిందం' సినిమాలో మాత్రం పక్కింటి కుర్రాడిలా చాలా పొందికైన పాత్రలో కనిపించాడు. పాత్రకు తగ్గట్లు మారిపోయే విజయ్ కి టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లో కూడా అభిమానులు ఉన్నారు. అందుకే ఆయన సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ఆడుతున్నాయి.

    పాన్ ఇండియా స్థాయిలో

    పాన్ ఇండియా స్థాయిలో

    ఇక ఇది ఇలా ఉండగా.. విజయ్ నటించిన 'డియర్ కామ్రేడ్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2019, జూలై 26న ప్రేక్షకుల ముందుకొచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీగా మంచి విజయాన్ని సాధించింది. స్టూడెంట్ యూనియన్ లీడర్ బాబీ, స్టేట్ లెవెల్ వుమెన్ క్రికెటర్ లిల్లీ ప్రేమ కథ ప్రేక్షకుల మనసును హత్తుకుంది.

     కెరీర్ బెస్ట్ ఫర్మార్మెన్స్

    కెరీర్ బెస్ట్ ఫర్మార్మెన్స్

    సమాజంలో తప్పును చూస్తే వెంటనే స్పందించే బాబి ఆ కోపం వల్ల చాలా కోల్పోవాల్సి వస్తుంది. క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ లైంగిక వేధింపుల కారణంగా తాను ప్రేమించిన లిల్లీ మానసికంగా కుంగిపోతుంది. ఈ కష్టాల నుంచి తన ప్రియురాలిని బాబి ఎలా కాపాడుకున్నాడు అనేది డియర్ కామ్రేడ్ కథ. ఈ సినిమాలో విజయ్, రష్మిక కెరీర్ బెస్ట్ ఫర్మార్మెన్స్ చేశారు.

    అందరినీ ఆకట్టుకుంది

    అందరినీ ఆకట్టుకుంది

    2019 లో మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. కొత్త దర్శకుడు భరత్ కమ్మ రూపొందించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించిన ఈ సినిమా మ్యూజిక్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. డియర్ కామ్రేడ్ మూవీని ఇతర భాషల్లో బాగా ప్రమోట్ చేశారు. హిందీ డబ్బింగ్ వెర్షన్ ను గోల్డ్ మైన్స్ యూట్యూబ్ ఛానెల్ అఫీషియల్ గా 2020 జనవరి 19న అప్ లోడ్ చేసింది.

    Recommended Video

    Vijay Devarakonda Doesn't Want To Work With Rashmika Mandanna || Filmibeat Telugu
     రేర్ ఫీట్

    రేర్ ఫీట్

    తాజాగా మిలియన్ల కొద్దీ వ్యూస్ పెరుగుతూ ప్రస్తుతం 30 కోట్ల వ్యూస్ దాటేసింది స్పెషల్ మూవీ. 3.5 మిలియన్ లైక్స్ రావడం ఒక రేర్ ఫీట్ అని చెప్పవచ్చు. ఇవన్నీ హీరోగా విజయ్ కున్న ప్యాన్ ఇండియా క్రేజ్ అని చెబుతున్నారు. ఇది డబ్బింగ్ మూవీస్ లో సరికొత్తగా రికార్డ్ గా చెబుతున్నారు. ఇదే కాక అప్ లోడ్ చేసిన రెండేళ్లలో 300 మిలియన్ పైచిలుకు వ్యూస్ క్రాస్ చేసింది ఈ డియర్ కామ్రేడ్ సినిమా హిందీ వెర్షన్. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

    English summary
    Dear comrade hindi version creates a new record
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X