Devara Trailer: ‘దేవర’ ట్రైలర్ లో ఎన్టీఆర్ విశ్వరూపం అదుర్స్.. ఆ సీన్స్ లో గూస్ బంప్సే..
Devara Trailer: ఎప్పుడెప్పుడని నందమూరి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ దేవర మరో బిగ్ అప్డేట్ వచ్చేసింది. భారీ బడ్డెట్ మూవీ 'దేవర'సినిమాకు సంబంధించినట్రైలర్ విడుదలైంది.ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ మూవీ పై ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచాయి. తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ మామూలుగా లేదు.సరిగా అభిమానుల ఆకలి తీర్చేలా దేవర మూవీ ట్రైలర్ ఉంది. ఈ ట్రైలర్ కేవలం ఎన్టీఆర్ ఫ్యాన్ నే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.
డైరెక్టర్ కొరటాల శివ రెండు భాగాలుగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. దేవర ఫస్ట్ పార్ట్ ను ఈనెల 27న రిలీజ్ చేయనున్నారు.నిజానికి ట్రిబుల్ ఆర్ మూవీ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మూవీ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.ఇందులో ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని చూపించారు. చాలా కాలం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా ఊర్ మాస్ లుక్‌లో యాక్షన్ అదరగొట్టేశాడు. ఈసారి ఎన్టీఆర్ హిట్ కొట్టడం పక్కా అంటున్నారు. ట్రైలర్ విడుదలైన కొన్ని నిమిషాల్లోనే మంచి రెస్పాన్స్ రావడంతో దేవర సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి.

ట్రైలర్ చూసినాక ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ పాత్రలో నటిస్తున్నట్లు అర్థమవుతుంది. అలాగే అదిరిపోయే తారక్ డైలాగ్స్, నటన, మాస్ లుక్ తెగ ఆకట్టుకుంటున్నాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ కూడా చాలా క్యూట్ గా పల్లెటూరి పిల్ల గా కనిపించింది. ఈ ట్రైలర్ లో 'వాడికి వాడి అయ్య రూపం వచ్చింది కానీ రక్తం రాలేదే' అని తారక్‌ను అంటుంది జాన్వీ కపూర్. దీంతో ఎన్టీఆర్ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతాడు.
ఎన్టీఆర్ చెరువు ఒడ్డున నిల్చున ఓ మాస్ డైలాగ్ చెబుతాడు. మొత్తానికి ఈ ట్రైలర్ విడుదలతో తారక్ ఫ్యాన్స్‌లో మరింత క్యూరియాసిటీ పెరుగుతోంది. ఇక దేవర నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్, పోస్టర్లకు మంచి స్పందన లభించింది. తారక్-జాన్వీ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. వీరిద్దరి మధ్య సాగిన రొమాంటిక్ సాంగ్స్ ప్రస్తుతం కూడా యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్నాయి.

దేవర చిత్రానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నార. ఈ చిత్రంలో సైఫ్ అలీఖన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ సమర్పణలో హరికృష్ణ కె, సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగుతోపాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో ఈ మూవీని సెప్టెంబరు 27 వ తారీకున థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.


Click it and Unblock the Notifications











