Devil Trailer బింబిసార 2పై అదిరిపోయే అప్‌డేట్.. కల్యాణ్ రామ్ లీక్ చేసిన విషయం ఏమిటంటే?
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా నిర్మించిన చిత్రం డెవిల్. సంయుక్త మీనన్, మాళవిక నాయర్ నటించిన ఈ సినిమా డిసెంబర్ 29వ తేదీన రిలీజ్ అవుతున్నది. శ్రీకాంత్ విస్సా, హర్షవర్ఱన్ రామేశ్వర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఆవిష్కరణ మంగళవారం జరిగింది. ఈ వేడుకలో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ..
మంచి కథ, కథనాలతో సినిమాను రూపొందించి ప్రేక్షకులను అబ్బురపరిస్తే.. ఆ సినిమాను ఆదరిస్తారని బింబిసార మూవీతో నిరూపించారు. అదే కోవలో మంచి కథ, కథనం, అద్బుతమైన విజువల్స్ ఉంటాయి. మిమ్మల్ని ఆకట్టుకొనే కమర్షియల్ అంశాలు ఈ సినిమాలో ఉంటాయి అని నందమూరి కల్యాణ్ రామ్ అన్నారు.

డెవిల్ సినిమా వన్ మ్యాన్ షో కాదు. ఇది టీమ్ అందరి సమిష్టి కృషి. ఈ సినిమా కోసం శ్రీకాంత్ మంచి కథ రాశారు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫి, వెంకట్ మాస్టర్, ఆరు నెలలుగా కష్టపడుతున్న క్యాస్టూమ్ డిజైనర్ రాజేశ్, ఈ సినిమా 1940 బ్యాక్ డ్రాప్‌తో పిరియాడిక్ మూవీ కావడంతో దాని కావాల్సిన సెట్స్ ఆర్ట్ డిపార్ట్‌మెంట్ గాంధీ లాంటి వాళ్లు కష్టపడి చేశారు. ఖర్చుకు వెనుకాడకుండా నిర్మాత అభిషేక్ నామా ఈ సినిమా ఉన్నారు.

డెవిల్ సినిమాలో మాళవిక నాయర్, సంయుక్త మీనన్, షఫీ లాంటి వాళ్లు చాలా కష్టపడి చేశారు. మా సమిష్టి కృషిని ఆదరిస్తే మాకు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. అంతేకాకుండా నాకు గుర్తింపు లభించడమే కాకుండా నాతో పనిచేసిన అందరికి మంచి పేరు తెచ్చి పెడుతుంది అని కల్యాణ్ రామ్ చెప్పారు.
డెవిల్ సినిమా డిసెంబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. నూటికి నూరుశాతం కథ కొత్తగా ఉంటుంది. మీకు కావాల్సిన అంశాలు అన్నీ ఉంటాయి. బింబిసార 2 సినిమా మే నెలలో ప్రారంభమవుతుంది. తప్పకుండా మీ అంచనాలకు తగినట్టుగా ఉంటుంది అని కల్యాణ్ రామ్ చెప్పారు.


Click it and Unblock the Notifications











