Dhanush Net Worth : ధనుష్ కుబేరా రెమ్యునరేషన్.. తమిళ స్టార్ ఆస్తుల నికర విలువ ఎన్ని కోట్లో తెలుసా?

కోలీవుడ్ స్టార్ ధనుష్ కు తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలకు తెలుగు స్టేట్స్ లోనూ మంచి మార్కెట్ ఉంది. మరోవైపు ధనుష్ చిత్రాల కోసం ఆడియెన్స్ ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా కుబేరా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జూన్ 20న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదలైంది. తొలిరోజు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా కుబేరా చిత్రానికి ధనుష్ ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు? ఆయన ఆస్తుల నికర విలువ ఎంతనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

ధనుష్ కుబేరా చిత్రం వివరాలు..
ప్రస్తుతం ధనుష్ డైరెక్ట్ గా తెలుగు చిత్రాల్లో నటిస్తూ అలరిస్తున్నారు. ఇప్పటికే సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో 'సార్' అనే చిత్రంలో నటించి బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. తాజాగా క్రైమ్ డ్రామా జోనర్ లో కుబేరా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. నాగార్జున ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ధనుష్ సరసన నటించింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ బ్యానర్లలో నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, అజయ్ కైకాల, శేఖర్ కమ్ముల నిర్మించారు. రూ.120 కోట్ల బడ్జెట్ ను కేటాయించారు. దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం.

Dhanush Kuberaa Movie Remuneration and His Total Net Worth

ధనుష్ కుబేరా పారితోషికం..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస చిత్రాలతో హిట్స్ అందుకుంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్ వద్ద ధనుష్ చిత్రాలకు మంచి రిజల్ట్ అందుతుండటంతో ఆయన పారితోషికాన్ని రీసెంట్ గా స్వల్పంగా పెంచారు. గతంలో ప్రతి సినిమాకు రూ.25 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునే వారు. ఇక కుబేరా చిత్రానికి రూ.30 కోట్ల పారితోషికం తీసుకున్నారని తెలుస్తోంది.

ధనుష్ టోటల్ ఆస్తుల నికర విలువ..
తమిళ స్టార్ ధనుష్ ఆస్తుపాస్తులు ఎక్కువగా చైన్నైలోనే ఉన్నాయ. ధనుష్ కు ప్రధాన ఆదాయ వనరు సినిమానే. మరే ఇతర వ్యాపారాలు లేవని తెలుస్తోంది. ఇక కేవలం సినిమాల ద్వారానే 2002 నుంచి ఇప్పటికి సంపాదించారు. కరోనా తర్వాత కూడా ఆయన ఆస్తుల విలువల రూ.160 కోట్లు ఉండేది. కానీ కెప్టెన్ మిల్లర్ చిత్రం తర్వాత భారీగా ఆస్తుల్లో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం ధనుష్ ఆస్తుల నికర విలువ రూ.230 కోట్లు ఉంటుందని కోలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి.

మరోవైపు ధనుష్ కు కోట్లు విలువ చేసే లగ్జరీ విలాసవంతమైన ఇల్లు, ప్రాపర్టీస్ ఉన్నాయి. రీసెంట్ గానే చెన్నైలోని పోస్ గార్డెన్ ఏరియాలో రూ.25 కోట్ల ఖర్చు పెట్టి లగ్జరీ ఇల్లును నిర్మించుకున్నారు. ఇక దేశ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో ధనుష్ ల్యాండ్లు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల ప్లాట్స్ ఉన్నాయి. ఇక ధనుష్ దగ్గర చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. అందులో రోల్స్ రాయిస్ ఘోస్ట్, బెన్ట్లీ కార్లు ఉండటం విశేషం.

More from Filmibeat

Read more about: dhanush Kuberaa remuneration
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X