ఆగిపోయిన నాగార్జున మల్టీస్టారర్ చిత్రం.. ఆర్థిక సమస్యలు!
కింగ్ నాగార్జున కూడా క్రమంగా మల్టీస్టారర్ చిత్రాలపై ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది నాగార్జున దేవదాస్ చిత్రంలో నేచురల్ స్టార్ నానితో కలసి నటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో రణబీర్ కపూర్, అలియా భట్ నటిస్తున్న బ్రహ్మాస్త్ర చిత్రంలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. ఇటీవల హీరో ధనుష్, నాగార్జున కలసి నటించే మల్టీస్టారర్ చిత్రం ప్రారంభం అయింది.
ఈ చిత్రానికి ధనుష్ స్వయంగా దర్శకత్వ భాద్యతలు చేపడుతుండడం విశేషం. ఇటీవల ధనుష్ నటించిన మారి 2 చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మారి 2 తరువాత ధనుష్, నాగ్ చిత్రం సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. కానీ ధనుష్ అసురన్ అనే చిత్రాన్ని ప్రారంభించాడు. కానీ మల్టీస్టారర్ చిత్ర ఊసే లేకపోవడంతో నాగ్, ధనుష్ చిత్రం ఆగిపోయిందనే వార్తలు వస్తున్నాయి.

ఈ చిత్రాన్ని నిర్మించాలనుకున్న తేనాండల్ మూవీస్ సంస్థ తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో చిక్కుకుపోయిందట. నిర్మాతలు లేకపోవడంతో సినిమాని ఆపేశారు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం పూర్తిగా ఆగిపోయిందా లేక ఆలస్యంగా మొదలు పెడతారా అనేది తెలియాలంటే అధికారికంగా ప్రకటన రావాలి.


Click it and Unblock the Notifications











