పవన్ కల్యాణ్‌ను డైరెక్ట్ చేయాలని ఉంది.. ధనుష్ వైరల్ కామెంట్స్

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లు ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న కలిసి నటించిన చిత్రం కుబేరా. సోషల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్వకత్వం వహించారు. ఈ సినిమాకు సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, శేఖర్ కమ్ముల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమా జూన్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది.

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాలో హిందీ నటులు జిబ్ సరబ్, దలీప్ తాహిల్, సాయాజీ షిండే, దివ్య డెకాటే, కౌశిక్ మహతా, హరీష్ పెరాడీ తదితరులు నటించారు. ఈ సినిమాకు నికెత్ బొమ్మిరెడ్డి, కార్తీక్ శ్రీనివాస్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లోని జేఆర్సీ ఫంక్షన్ హాల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో నాగార్జున అక్కినేని, ధనుష్, రష్మిక మందన్న, శేఖర్ కమ్ముల, చిత్ర యూనిట పాల్గొన్నారు.

Dhanush Wants to direct Pawan Kalyan

కుబేరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సినిమా వేడుకకు యాంకర్ సుమ హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ వేడుకలో ఈ మూవీ తొలి టికెట్‌ను రాజమౌళి కొనుగోలు చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. అనంతరం ఈ వేడుక నుంచి నిష్క్రమించారు. ఈ వేడుకలో సుమ ఎప్పటిలానే హంగామా చేసి సెలబ్రిటీల నుంచి వైరల్ కంటెంట్ రాబట్టింది.

అయితే ఈవెంట్‌లో ధనుష్‌తో సరదగా సంబాసించింది. మీరు తమిళంలో దర్శకత్వం చేశారు. తెలుగులో అవకాశం వస్తే ఎవరినీ డైరెక్ట్ చేస్తారు అని అడిగితే.. పవన్ కల్యాణ్ సార్‌ను డైరెక్ట్ చేయాలని ఉంది అని ఆయన అన్నారు. దాంతో ప్రేక్షకుల పెద్ద ఎత్తున కేకల వేస్తూ ఈలలు చేశారు. దాంతో ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తర్వాత మీ సినిమా ఉండాలని కోరుకొంటున్నాను. మీరు వైరల్ రిప్లై ఇచ్చారు.. అంటూ కామెంట్ చేసింది.

డబ్బు లేకపోయినా మనకు లభించేది ఏమిటి? అని అడిగితే.. మనీ లేకుండా లభించేది తల్లి ప్రేమ అంటూ కామెంట్ చేశాడు. ఇక అలాగే కొలవెర్రీలో ఎన్ని కొలవెరీలు ఉన్నాయంటే.. తెలియదు అని చెప్పారు. ఇలా ధనుష్ చిలిపిగా, ఎమోషనల్‌గా సమాధానాలు చెప్పి తన అభిమానులను సంతోషపరిచారు.

ధనుష్ చేసిన వ్యాఖ్యలు పవన్ కల్యాణ్ అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. ధనుష్ చేసిన కామెంట్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ట్రెండ్ అవుతున్నది. ధనుష్ మాటలు నిజం కావాలని కోరుకొంటున్నామంటూ పవర్ స్టార్ ఫాన్య్స్ కామెంట్ చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: dhanush pawan kalyan Kuberaa
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X