Samantha divorce: చీటర్స్ అంటూ సిద్ధార్థ్ షాకింగ్ ట్వీట్.. అవునంటూ పూనం కౌర్ సంచలనం
నాగ చైతన్య అక్కినేని సమంత లో విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసింది చాలా రోజు నుంచి విడాకులు గురించి పెద్దఎత్తున చర్చలు జరుగుతున్న ఇప్పటివరకు స్పందించలేదు గాని ఈ రోజు విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. ఇది విడాకుల గురించి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి ప్రతి ఒక్కరు ఈ అంశం గురించి స్పందిస్తున్నారు అయితే తాజాగా హీరో సిద్ధార్థ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

ఎట్టకేలకు అఫీషియల్ గా
చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగా సమంత నాగచైతన్య ఇద్దరూ కూడా తాము విడాకులు తీసుకోబోతున్నట్లు అని ప్రకటించారు ఇకమీదట స్నేహితులుగా కొనసాగుతానని భార్యాభర్తల బంధానికి ముగింపు ఉన్నామని పేర్కొన్నారు. అయితే వీరు అలా సోషల్ మీడియాలో ప్రకటించారో లేదో అప్పటి నుంచి ఈ విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది. నాగచైతన్య ప్రకటించిన తర్వాత నాగార్జున కూడా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని సోషల్ మీడియా వేదికగా కోరారు.

గతంలో క్లోజ్ గా
అయితే సమంత విడాకుల విషయంలో ఇప్పుడు ఒక ట్వీట్ ఆసక్తికరంగా మారింది.. గతంలో సమంత - సిద్ధార్థ్ డేటింగ్ చేసినట్టు ప్రచారం జరిగింది. ఇక వీరిద్దరూ కలిసి పెళ్లి చేసూకోవడమే తరువాయి అని ప్రచారం జరిగిన క్రమంలో అనూహ్య పరిస్థితుల్లో వీరు విడిపోయారు. ఈ విషయాన్ని సమంత అఫీషియల్ గా సావిత్రి జీవితంతో తన జీవితాన్ని పోలుస్తూ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది.

మోసగాళ్లు ఎప్పటికీ బాగుపడరు
అయితే తాజాగా సిద్ధార్థ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ''స్కూల్ లో నేను నేర్చుకున్న మొదటి పాఠం ఏంటంటే.. ''మోసగాళ్లు ఎప్పటికీ బాగుపడరు''.. మరి మీ సంగతేంటి..?'' అని ఆయన నెటిజన్లను ప్రశ్నించాడు. అయితే ఆయన దేని గురించి మాట్లాడుతున్నారో ఉన్నట్టుండి సిద్ధార్థ్ ఇలా చీటర్స్ గురించి పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. సిద్ధార్థ్ ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టారు అనే చర్చ మొదలు కాగా సమంతను ఉద్దేశించే ఇలా ట్వీట్ చేశారని నెటిజన్లు భావిస్తున్నారు.

నిజమేనన్న పూనమ్ కౌర్
ఇప్పుడు సమంత.. చైతు నుంచి కూడా విడిపోతుండడంతో.. ఆమె విడాకుల విషయాన్ని టార్గెట్ చేస్తూ సిద్ధార్థ్ ఇలాంటి ట్వీట్ వేశాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం వాళ్ళ బాధలో వాళ్ళు అంటే ఈ టైం లో ఈ మాటలు అవసరమా అంటూ సిద్ధార్థ్ ను తిట్టిపోస్తున్నారు. అయితే అనూహ్యంగా సిద్ధార్థ చేసిన ట్వీట్ ను రీ ట్వీట్ చేసిన పూనం కౌర్ అది నిజమేనని పేర్కొంది..

అనూహ్యంగా
కొద్ది రోజుల నుంచి పంజాబీ భామ అనగానే గుర్తుకు వస్తున్న పూనమ్ కౌర్ ఈ విషయంలో స్పందించడం కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే సిద్ధార్థ ఎవరి గురించి ట్వీట్ చేశారు అనే విషయం మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి ఇదంతా నెటిజన్లు ఊహ మాత్రమే అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











